గుజరాత్ రాష్ట్రంలోని అహ్మదాబాద్ నగరంలో ఉన్న వస్నాలో ఓ ఘటన చోటుచేసుకుంది.అయితే భర్త చనిపోయి డిప్రెషన్ లో ఉన్న ఎన్నారై మహిళను ఆన్లైన్ లో ఓ వ్యక్తి పరిచయమయి ఏకంగా ఆమె దగ్గర 34 లక్షలు కొట్టేశాడు.
అయితే ఆ వ్యక్తి ఆమెను ఎమోషనల్ గా బ్లాక్ మెయిల్ చేసి భారీ మొత్తాన్ని కొల్లగొట్టాడు.అయితే ఈ విషయాన్ని శుక్రవారం బాధితురాలు సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.
అయితే ఎఫ్ఐఆర్ ప్రకారం గ్రీన్ కార్డు ఉన్న ఒక 63 ఏళ్ల మహిళ ఎనిమిది నెలలు అమెరికా లో ఉంటూ నాలుగు నెలలు ఇండియాలో ఉంటుంది.
అయితే కొంతకాలం క్రితం ఆమె భర్త చనిపోవడంతో డిప్రెషన్ లో ఉన్న ఆమెకు ఈ ఏడాది సెప్టెంబర్ లో అండ్రేస్ పేరుతో సోషల్ మీడియా సైట్ లో ఓ వ్యక్తి పరిచయం అయ్యాడు.
ఆ తర్వాత ఆమెతో తరచూ చాట్ కూడా చేసి దగ్గరయ్యాడు.దీంతో ఆమె అతని వాట్సాప్ నెంబర్ ను పంచుకుంది.ఈ క్రమంలోనే తన భార్యకు జబ్బు చేసి రెండేళ్ల క్రితం కాలం చేసినట్లు ఆమెతో చెప్పాడు.అలాగే ఆమె పెద్ద వ్యాపారవేత్త అని తనకు నాలుగైదు పెద్ద బిజినెస్ లు కూడా ఉన్నాయని అయితే ఏదో రోజు తాను ఒప్పుకుంటే ఆమెను పెళ్లి కూడా చేసుకుంటానని ఆమెకు ప్రపోజ్ చేశాడని ఆమె తెలిపింది.
అయితే ఆ కొన్ని రోజుల తర్వాత సడన్ గా అండ్రేస్ ఫోన్ చేసి కొన్ని ఆర్థిక కారణాలవల్ల తన బ్యాంక్ ఖాతాలు బ్లాక్ అయిపోయాయని కొంత నగదు డబ్బులు కావాలని ఆమెతో అడిగాడట.ఆమె సాయం చేయాలనిపించి 19 లక్షలు ఆమెకు అతనికి ట్రాన్స్ఫర్ చేసిందని ఆమె తెలిపింది.
ఆ తర్వాత కష్టం ఆఫీసర్ పేరుతో ఓ మహిళ ఫోన్ చేసి అండ్రేస్ కొన్ని గిఫ్ట్ పంపించినాడనీ వాటికి టాక్స్ కింద రూపాయలు 15 లక్షలు కట్టి తీసుకోవాలని వాటికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు పంపించారట.
![Telugu Ahmedabad, Cybercrime, Gujarat, International, Nri-National News Telugu Ahmedabad, Cybercrime, Gujarat, International, Nri-National News](https://telugustop.com/wp-content/uploads/2022/12/A-man-pretending-to-love-NRI-woman-is-a-huge-fraud-onlinea.jpg )
దీంతో వాటికోసం ఆమె 15 లక్షలు చెల్లించింది.ఆ మరుసటి రోజు ఆమెకు ఆర్బిఐ ఆఫీసర్ అంటూ ఒక వ్యక్తి కాల్ చేసి ఆమెకు మరింత డబ్బు డిమాండ్ చేశాడట.దీంతో తను మోసపోయిందని గ్రహించి సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు ఇచ్చింది.
దీంతో పోలీసులు అండ్రేస్ పై ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఆక్ట్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.