వైరల్: మాస్ స్టెప్పులతో స్టూడెంట్స్ ని కైపెక్కించిన టీచర్... ఇలాంటి అనుభవం మీకు వుందా?

సోషల్ మీడియాలో రోజూ ఎన్ని వీడియోలు అప్‌లోడ్ అయినా, కొన్ని కొన్ని మాత్రమే వైరల్ అవుతుంటాయి.ఎందుకంటే వాటిలో ఏదో ఒక స్పెషల్ ఉంటుంది కాబట్టి.

 Viral: Teacher Who Won Over Students With Mass Steps Do You Have Similar Experie-TeluguStop.com

తాజాగా అలాంటి రకానికి చెందిన వీడియో ఒకటి సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.విషయం ఏమంటే, అది ఒక క్లాస్ రూంలో జరిగిన డాన్స్ వీడియో.

ముఖ్యంగా ఇలాంటి వీడియోలు నెటిజన్లను బాగా ఆకట్టుకుంటాయి.ఫ్లోరిడా తరగతి గదికి సంబంధించిన వీడియోలో టీచర్, స్టూడెంట్ డాన్స్ చేయడం స్పష్టంగా చూడవచ్చు.

టీచర్, స్టూడెంట్ మధ్య వున్న అనుబంధాన్ని ఈ వీడియో తెలియజేస్తుంది.మొదట ఈ వీడియోలో, ఒక పిల్లవాడు తన గురువుతో స్టెప్పులు వేయడం చూడవచ్చు.ఆ తరువాత ఆ టీచర్ డాన్స్ ఇరగదీసేస్తుంది.ఈ డాన్స్ పోటీ అందరి హృదయాలను గెలుచుకుంది.

ఈ డాన్స్ వీడియో ఫ్లోరిడాలోని సమ్మర్ హై స్కూల్ లో జరిగినట్టు సమాచారం.ఈ వీడియోలో విద్యార్థులు తమ టీచర్‌ను డాన్స్ చేయమని సవాలు చేస్తూ కనిపించారు.

ఆ తర్వాత టీచర్ చేసిన డ్యాన్స్ అందరినీ ఆశ్చర్యపరిచింది.

కాగా ఆ మహిళా టీచర్ చేసిన డాన్స్ అందరినీ అవాక్కయేలా చేసింది.

ఎందుకంటే ఆమె వయస్సులో పెద్దదిగా వుంది కాబట్టి.ఆ వయస్సులో కూడా అంత మంచి ఈజ్ తో డాన్స్ చేయడం ఎవరి తరమూ కాదు.

ఈ వీడియో @McClainEducates ఖాతా నుంచి Twitterలో షేర్ చేయబడింది.ఈ వీడియోను ఇప్పటివరకు 12 లక్షలకు పైగా వీక్షించగా 25 వేల మంది లైక్ చేశారు.

అంతే కాకుండా చాలా మంది ఈ వీడియోను షేర్ చేయడం ఇక్కడ చూడవచ్చు.పలువురు నెటిజన్లు స్పందిస్తూ….

ఇది ఒక మంచి అనుభూతి ఇలాంటి అనుభవాలు మాకు కూడా వున్నాయి అంటూ… కామెట్స్ చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube