టాలీవుడ్ ఇండస్ట్రీలో కొన్ని జోడీలు రీల్ జోడీలు అయినా ప్రేక్షకుల హృదయాలలో రియల్ జోడీల స్థాయిలో గుర్తింపును సొంతం చేసుకున్నాయి.వెంకటేశ్ సౌందర్య కాంబినేషన్ కు ప్రేక్షకుల్లో ఉన్న గుర్తింపు అంతాఇంతా కాదు.
ఈ కాంబినేషన్ లో తెరకెక్కిన ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్ సినిమాలు రికార్డ్ స్థాయిలో కలెక్షన్లను సొంతం చేసుకున్నాయి.వెంకటేశ్ పర్సనల్ మేకప్ మేన్ రాఘవ ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ షాకింగ్ విషయాలను వెల్లడించారు.
రామానాయుడు చనిపోయిన సమయంలో ఆ బాధ నుంచి వెంకటేశ్ కోలుకోవడానికి చాలా సమయం పట్టిందని అన్నారు.ఒక వారం రోజులు ఇంటికి వెళ్లకపోతే ఎక్కడ ఉన్నావని వెంకటేశ్ సమాచారం తెలుసుకుంటారని రాఘవ తెలిపారు.
నేను మేకప్ వేస్తుంటే వెంకటేశ్ కన్నీళ్లు పెట్టుకునేవారని రాఘవ కామెంట్లు చేశారు.తండ్రీ కొడుకుల మధ్య మంచి అనుబంధం ఉండేదని రాఘవ చెప్పుకొచ్చారు.నాన్న పేరు వినిపిస్తే వెంకటేశ్ కళ్లు ఎర్రబడేవని ఆయన కామెంట్లు చేశారు.
వెంకటేష్ చాలా సెన్సిటివ్ అని రాఘవ అన్నారు.వెంకటేశ్ సౌందర్య మధ్య ఏదో ఉందని ప్రచారం చేశారని ఆ ప్రచారంలో నిజం లేదని రాఘవ చెప్పుకొచ్చారు.ఏడు సినిమాలు చేయడం వల్ల వార్తలు ప్రచారంలోకి వచ్చాయని ఆయన అన్నారు.
సౌందర్య చనిపోయే వరకు వెంకటేశ్ గారిని సార్ అని పిలిచేదని రాఘవ కామెంట్లు చేశారు.గాసిప్స్ ను వెంకటేశ్ పట్టించుకోరని ఆయన కామెంట్లు చేశారు.
సౌందర్య ఇంటికి వెళ్లిన సమయంలో వెంకటేశ్ గారికి, నాకు ఆమే వడ్డించిందని ఆయన అన్నారు.సౌందర్య చాలా మంచి అమ్మాయి అని రాఘవ అన్నారు.సౌందర్య చనిపోయిన సమయంలో వెంకటేశ్ చాలా బాధ పడ్డారని ఆయన పేర్కొన్నారు.ఘర్షణ షూట్ సమయంలో శ్రీలంకలో బోట్ తిరగబడి వెంకటేశ్ కు, చిత్రయూనిట్ కు యాక్సిడెంట్ అయిందని రాఘవ వెల్లడించారు.
రాఘవ చెప్పిన విషయాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.