టాలీవుడ్ ఇండస్ట్రీలో ప్రయోగాత్మక సినిమాలు చేసే విషయంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ ముందువరసలో ఉంటారని చాలామంది భావిస్తారు.జై లవకుశ సినిమాలో మూడు రోల్స్ లో అద్భుతంగా నటించి ఒక పాత్రకు మరో పాత్రకు అద్భుతంగా వేరియేషన్ చూపించి ఎన్టీఆర్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్నారు.
ఈ సినిమాలో లవ, కుశ పాత్రలతో పోలిస్తే జై పాత్ర తారక్ కు మరింత మంచి పేరు తెచ్చిపెట్టింది.
అయితే శంకర్ డైరెక్షన్ లో రామ్ చరణ్ నటిస్తుండగా ఈ సినిమాలో ఫ్లాష్ బ్యాక్ లో కనిపించే చరణ్ పాత్ర నత్తితో మాట్లాడుతూ కనిపిస్తుందని తెలుస్తోంది.
ఈ పాత్ర సినిమా రేంజ్ ను మరింత పెంచేలా ఉండనుందని ఇతర హీరోలతో పోల్చలేనంత అద్భుతంగా చరణ్ ఈ పాత్రలో కనిపించనున్నారని తెలుస్తోంది.రంగస్థలం సినిమాలో సరిగ్గా వినబడని పాత్రను పోషించిన చరణ్ ఆ పాత్రకు అంచనాలకు మించి న్యాయం చేశారనే సంగతి తెలిసిందే.
యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఇప్పటికే నత్తి పాత్రలో నటించి మెప్పించగా చరణ్ సైతం తారక్ ను ఫాలో అవుతున్నారు.ఎఫ్3 మూవీలో వరుణ్ తేజ్ కూడా ఇలాంటి పాత్రలో నటించి మెప్పించిన సంగతి తెలిసిందే.టాలీవుడ్ స్టార్ హీరోలు రొటీన్ కు భిన్నమైన పాత్రల్లో కనిపించాలని భావిస్తున్నారు.అయితే చరణ్ శంకర్ మూవీ ఫస్ట్ లుక్ ను ఎప్పుడు రిలీజ్ చేస్తారో చూడాల్సి ఉంది.
సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో వెంకటేశ్ కు భార్యగా నటించిన అంజలి ఈ సినిమాలో చరణ్ కు భార్యగా నటిస్తున్నారు.రామ్ చరణ్ అంజలి మధ్య ఏజ్ కేవలం ఏడాది మాత్రమే డిఫరెన్స్ ఉండటం గమనార్హం.
చరణ్ అంజలి కాంబోకు ప్రేక్షకుల నుంచి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాల్సి ఉంది.