సమంతలాగే నేను కూడా ఆ సమస్యతో బాధపడుతున్నా.. రంగం నటి కామెంట్స్ వైరల్?

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ సమంత తాను మయోసైటిస్‌ అనే బాధపడుతున్నట్టు ప్రకటించడంతో అభిమానులు ఒక్కసారిగా నాకు గురైన విషయం తెలిసిందే.ఇటీవలే ఆమె కోల్కున్నట్టు వార్తలు వినిపించినప్పటికీ సమంత ఆరోగ్యం మరింత క్షీణించి వైద్యం కోసం విదేశాలకు వెళ్లిన విషయం తెలిసిందే.

 Actress Pia Bajpai Reacts About Samantha Myositis Pia Bajpai, Samantha, Myositis-TeluguStop.com

మయోసైటిస్‌ అంటే ఆటో ఇమ్యూన్ కారణంగా వచ్చే ఈ వ్యాధి వల్ల కండరాల నొప్పులు తీవ్రంగా ఉంటాయి.ఈ కండరాల నొప్పి వల్ల ఒక్కొక్కసారి కథలేని పరిస్థితి కూడా ఏర్పడుతూ ఉంటుంది.

కాగా ఈ ఆటో ఇమ్యూన్‌తో పాటు వైరస్‌, కొన్ని మందుల ప్రభావంతోనూ మయోసైటిస్‌ సమస్య వస్తుంది.

కాగా సమంత ప్రస్తుతం మయోసైటిస్‌ చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

మొన్నటికి మొన్న సమంతతో పాటు తాను కూడా మయోసైటిస్ అనే వ్యాధితో బాధపడుతున్నట్టు నటి కల్పిక గణేష్ చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే.అయితే తాజాగా తాను కూడా మయోసైటిస్‌ వ్యాధితో పోరాడినట్లు హీరోయిన్‌ తెలిపింది.

ఆ హీరోయిన్ మరెవరో కాదు పియా బాజ్‌పేయి.ఈ విషయంపై మాట్లాడుతూ.సమంత పరిస్థితిని అర్థం చేసుకోగలను.ఎందుకంటే నేను కూడా గతంలో మయోసైటిస్‌ బారిన పడ్డాను.చికిత్స లేని వ్యాధి బారిన పడితే వాళ్ల మానసిక స్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోగలను.

నాకు మయోసైటిస్‌ వచ్చిందని విషయం ఇంట్లో వాళ్లకు కూడా చెప్పలేదు. ముంబైలో ఉండి చికిత్స తీసుకున్నాను.సమంతకు మయోసైటిస్‌ ఉందని తెలియగానే బాధపడ్డా అంటూ చెప్పుకొచ్చింది.

కాగా పియా బాజ్‌పేయి జీవా హీరోగా నటించిన రంగంసినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన విషయం తెలిసిందే.ఇండస్ట్రీలో ఒకరి తర్వాత ఒకరు నటీమణులు ఈ విధంగా ఆ మయోసైటీస్ అనే వ్యాధి బారిన పడుతుండడంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube