టాలీవుడ్ సినీ ప్రేక్షకులకు హీరోయిన్ నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రష్మిక ఇటీవల విడుదల అయిన పుష్ప సినిమాతో ఆమె పాన్ ఇండియా హీరోయిన్ గా మారిన విషయం తెలిసిందే.
ఇకపోతే రష్మిక మందన కి ఉన్న క్రేజ్, ఫ్యాన్స్ ఫాలోయింగ్ గురించి మనందరికి తెలిసిందే.ఇకపోతే రష్మిక ప్రస్తుతం వరుస సినిమాలలో నటిస్తూ దూసుకుపోతున్న విషయం తెలిసిందే.
టాలీవుడ్ తో పాటు బాలీవుడ్ కోలీవుడ్ సినిమాలలో నటిస్తూ వరుసగా అవకాశాలను అందుకుంటూ దూసుకుపోతోంది ఈ బ్యూటీ.
ఒకవైపు సినిమాలలో నటిస్తూనే మరొకవైపు సమయం దొరికినప్పుడల్లా వెకేషన్ లు తిరుగుతూ ఎంజాయ్ చేస్తోంది ఈ బ్యూటి.
ఇది ఇలా ఉండే తాజాగా రష్మిక మందన తాజాగా నటించిన చిత్రం మిషన్ మజ్ను.ఈ సినిమాతో రష్మిక మందన బాలీవుడ్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తోంది.తాజాగా ఈ సినిమాకు సంబంధించిన క్రేజీ అప్‌డేట్ వచ్చేసింది.తాజాగా ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించింది చిత్రబృందం.
షంతను బాగ్చీ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని నేరుగా ఓటీటీలోనే రిలీజ్ చేయనున్నట్లు ప్రకటించారు.
వచ్చే ఏడాది జనవరి 20న నెట్‌ఫ్లిక్స్‌లో విడుదల కానున్నట్లు తెలిపారు.1970ల నాటి కథతో తెరకెక్కిన ఈ చిత్రంలో రా ఏజెంట్‌గా సిద్ధార్థ్ మల్హోత్రా కనిపించనున్న విషయం తెలిసిందే.కాగా ఈ సినిమాను రోనీ స్క్రూవాలా, అమర్ బుటాలా, గరిమ మెహతా నిర్మిస్తున్న విషయం తెలిసిందే.
అయితే ఈ సినిమా ఇప్పటికే విడుదల కావాల్సి ఉండగా పలుసార్లు వాయిదా పడుతూ వచ్చింది.ఎట్టకేలకు ఈ సినిమా జనవరి 20 ప్రేక్షకులు ముందుకు రానుంది.అయితే ఈ సినిమా డైరెక్ట్ గా ఓటీటీ లోకి విడుదల అవుతుండడంతో చాలామంది రష్మిక రేంజ్ పడిపోయిందా అందుకే ఓటీటీ లో డైరెక్ట్గా సినిమా విడుదల అవుతూ ఉందా అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.