మధుమేహం లేదా షుగర్ వ్యాధి .ఎప్పుడు, ఎవర్ని ఎటాక్ చేస్తుందో ఎవరూ ఊహించ లేరు.
సైలెంట్ గా దాడి చేసే ఈ షుగర్ వ్యాధి.ఒక్కసారి వచ్చిందంటే జీవిత కాలం ముప్ప తిప్పలు పెడుతూనే ఉంటుంది.
రక్తంలో చక్కెర స్థాయిలు ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండటమే మధుమేహం.ఈ మధుమేహాన్ని అదుపులో ఉంచుకోకుంటే.
ప్రాణాలే రిస్క్‌లో పడతాయి.అయితే మధుమేహాన్ని అదుపు చేయడంలో మల్లెపూలు అద్భుతంగా సహాయపడతాయి.
మల్లె పూలు కేవలం అలంకరణ కోసమే వాడతారని చాలా మంది భావిస్తారు.కానీ, మల్లె పూలు ఆరోగ్యానికి కూడా ఎన్నో విధాలుగా ఉపయోగపడతాయి.ముఖ్యంగా మధుమేహం వ్యాధి గ్రస్తులకు మల్లె పూలు ఎంతో మేలు చేస్తాయి.ఒక గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ గుప్పెడు ఫ్రెష్‌గా ఉండే మల్లె పూలు, టీ పొడి వేసి బాగా మరిగించి వడబోసుకోవాలి.
ఇప్పుడు ఈ వాటర్‌లో కొద్దిగా తేనె కలిపి సేవించాలి.ఈ మల్లె పూల టీ ప్రతి రోజు ఒక కప్పు చప్పున తీసుకుంటే.
రక్తంలో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి.
అంతేకాదు, ఈ టీ తీసుకోవడం వ్యాధి నిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
జలుబు, దగ్గు వంటి సమస్యలు దూరం అవుతాయి.బరువు తగ్గించుకోవాలని ప్రయత్నించే వారు మల్లె పూల టీ తీసుకుంటే.
శరీరంలో కొవ్వు కరుగుతుంది.దాంతో వెయిట్ అవుతాయి.
అలాగే కడుపు అల్సర్‌తో ఇబ్బంది పడే వారు మల్లె పూల టీ తీసుకుంటో ఎంతో మంచిది.
మల్లె పూల టీ తీసుకోవడం వల్ల కళ్లు మంట పుట్టడం తగ్గుతుంది.తలనొప్పి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యల నుంచి తక్షణ ఉపశమనం లభిస్తుంది.ఇక చర్మానికి కూడా మల్లె పూల టీ మంచిగా ఉపయోగపడుతుంది.
ముఖ్యంగా మల్లె పూల టీ తాగితే ముడతలు, సన్నని చారలు రాకుండా చర్మం యవ్వనంగా, కాంతివంతంగా ఉంటుంది.