కాజల్ అగర్వాల్ ఏంటి ఇలా తయారయ్యింది.. న్యూ లుక్ చూసి షాక్ అవుతున్న అభిమానులు?

తెలుగు సినీ ప్రేక్షకులకు టాలీవుడ్ స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.తెలుగు ఇండస్ట్రీలో స్టార్ హీరోల సరసన నటించిన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది కాజల్ అగర్వాల్.

 Heroine Kajal Aggarwal Gaining Weight Her Latest Look Leaves Fans In Shock Kajal-TeluguStop.com

టాలీవుడ్ లో చిరంజీవి, రామ్ చరణ్, ప్రభాస్, అల్లు అర్జున్, మహేష్ బాబు లాంటి స్టార్ హీరోల సరసన నటించి స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.కాగా మొదట లక్ష్మి కళ్యాణం సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది కాజల్.

ఆ తర్వాత ఈమెకు వరుసగా అవకాశాలు రావడంతో అతి తక్కువ సమయంలోనే ఊహించని విధంగా స్టార్ హీరోయిన్ రేంజ్ కి దిగింది.

ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ తన చిన్ననాటి స్నేహితుడు గౌతమ్ ని ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం మనందరికీ తెలిసిందే.

ఈ ఏడాది ఈమె పండంటి మగబిడ్డ జన్మనిచ్చిన విషయం తెలిసిందే.పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటున్న కాజల్ అగర్వాల్ ఇంటి బాద్యతలు చూసుకుంటూ తన కొడుకుని కలిసి ఎంజాయ్ చేస్తూ కుటుంబ బాధ్యతలు నిర్వహిస్తోంది.

కాగా సాధారణంగా ఆడవారికి పెళ్లయి పిల్లలు పుట్టిన తర్వాత శరీరంలో అనేక మార్పులు వస్తాయి.ప్రస్తుతం కాజల్ కూడా ఇదే సమస్యను ఎదుర్కొంటోంది.ఇది ఇలా ఉంటే కాజల్ అగర్వాల్ లేటెస్ట్ పిక్స్ చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అవుతున్నారు.టాలీవుడ్ చందమామ అయిన కాజల్ అగర్వాల్ ఇలా మారిపోయింది ఏంటి అనే ఆశ్చర్య వ్యక్తం చేస్తున్నారు.

సోషల్ మీడియాలో కాజల్ అగర్వాల్ లేటెస్ట్ లుక్స్ సంబంధించిన ఫోటోలు తెగ వైరల్ అవుతున్నాయి.అభిమానులు మీరు ఎప్పటిలాగే మారి మళ్లీ సినిమాలలో నటించాలి మేడం అంటూ అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.జీవితంలో తల్లితనం అన్నింటికంటే ముఖ్యం.కాబట్టి బరువు పెరిగినందుకు కాజల్ బాధపడాల్సిన అవసరం లేదు.అందులోనూ హీరోయిన్ గా ఆమె కెరీర్లో హైట్స్ చూశారు.కొత్తగా ఆమె సాధించాల్సింది ఏమీ లేదు అంటూ ఇంకొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube