ఏడుపదుల వయసులోనూ టిడిపి అధినేత చంద్రబాబు యాక్టివ్ గా రాజకీయాలు చేస్తున్నారు.పార్టీని 2024 ఎన్నికల్లో అధికారంలోకి తీసుకురావడమే ఏకైక లక్ష్యంగా ముందుకు వెళుతున్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో పార్టీ నేతలు అందరిని ఏకతాటిపై తీసుకువచ్చి, వైసీపీ ప్రభుత్వం పై పోరాడే విధంగా జనాల్లో టిడిపి గ్రాఫ్ పెంచే విధంగా బాబు ప్రయత్నాలు మొదలుపెట్టారు.దీనిలో భాగంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలోనూ బాబు పర్యటనలు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు .ముందుగా జిల్లాల వారీగా పర్యటనలకు శ్రీకారం చుట్టారు.టిడిపికి కంచుకోటగా పేరుపొందిన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాపై ప్రత్యేకంగా ఫోకస్ పెట్టారు.
దీనిలో భాగంగానే నేటి నుంచి మూడు రోజులపాటు ఈ జిల్లాలోనే బాబు పర్యటన కొనసాగనుంది.
వచ్చే నెల రెండో తేదీ వరకు ఆయన ఈ జిల్లాలోని ఉండనున్నారు.
ఈరోజు ఉదయం 11:30 గంటలకు పశ్చిమగోదావరి కి చేరుకున్న బాబు అక్కడ జరిగే బహిరంగ సభలో మాట్లాడబోతున్నారు.వైసిపి ప్రభుత్వం పై సెటైరికల్ గా ‘ ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి ‘ కార్యక్రమంను బాబు ప్రారంభిస్తారు.
దీనికోసం టిడిపి భారీగా ఏర్పాట్లు చేసింది.విజయరాయి లో బహిరంగ సభ ముగిసిన తర్వాత మూడు గంటలకు వలసపల్లి అడ్డరోడ్డుకు బాబు చేరుకుంటారు.
అక్కడి నుంచి ధర్మాజీగూడెం, మఠంగూడెం, లింగంపాలెం గ్రామాల్లో జరిగే సమావేశాల్లో ఆయన పాల్గొంటారు .ఈరోజు సాయంత్రానికి చింతలపూడి చేరుకుని అక్కడ జరిగే బహిరంగ సభలో ప్రసంగించబోతున్నారు.
రాత్రికి జంగారెడ్డిగూడెం సమీపంలోని నరసన్న పాలెం లో ఉన్న దండమూడి రామలక్ష్మి ఫంక్షన్ హాల్ లో బస చేస్తారు.2019 ఎన్నికలకు ముందు వరకు టిడిపికి ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కంచుకోటగా ఉండేది.అత్యధిక స్థానాలను ఈ జిల్లా నుంచి టీడీపీ గెలుచుకుంది.అయితే 2019లో పాలకొల్లు, ఉండి నియోజకవర్గం వైసీపీ అభ్యర్థులు గెలుపొందడం, టిడిపి బలం తగ్గిపోవడంతో బాబు మళ్ళీ ఈ జిల్లాను కంచుకోటగా మార్చుకోవాలని భావిస్తున్నారు.
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో టిడిపికి పెద్ద ఎత్తున కార్యకర్తలు ఉండడంతో వారందరిని యాక్టివ్ చేసి మళ్లీ గోదావరి జిల్లాలను కంచుకోటగా మార్చుకుంటే టీడీపీకి తిరుగుండదని, ఈ జిల్లాలో పార్టీ అభ్యర్థులు విజయం సాధిస్తే తప్పకుండా ప్రభుత్వం ఏర్పడుతుందne సెంటిమెంట్ ఎప్పటి నుంచో ఉండడంతో, బాబు గోదావరి జిల్లాలపై ప్రత్యేకంగా దృష్టి సారించినట్లుగా కనిపిస్తున్నారు.
.