సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలో గల ప్రభుత్వ మెడికల్ కళాశాల నందు బుధవారం జిల్లా పోలీస్ ఆధ్వర్యంలో యాంటీ ర్యాగింగ్ అవగాహన సదస్సును నిర్వహించారు.ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ రాజేంద్రప్రసాద్ ముఖ్య అధిదిగా హాజరై మాట్లాడుతూ ర్యాగింగ్ చేయడమనేది మంచి విద్యార్థి లక్షణం కాదని,ర్యాగింగ్ చేయడం వల్ల ఎదుటివారు మానసికంగా చాలా ఇబ్బందులు పడతారని, అదేవిధంగా ర్యాగింగ్ చేయడం వల్ల చట్టపరమైన సమస్యలు ఎదుర్కొని ర్యాగింగ్ చేసిన విద్యార్థులు కూడా ఇబ్బందులకు గురవుతారని,ఇలాంటి చర్యలకు ఏ విద్యార్థి కూడా పాల్పడవద్దని సూచించారు.
భిన్న ప్రాంతాలకు చెందిన విద్యార్థులు విద్యను అభ్యసించడం కోసం ఇక్కడికి వచ్చారు.కాబట్టి అందరూ ఒక కుటుంబంలా కలిసిమెలిసి ఉండాలని,తోటి విద్యార్థులను ఇబ్బంది పెట్టడం, మానసికంగా వత్తిడికి గురి చేయడం అనేది చాలా బాధాకరమైన విషయమన్నారు.
ర్యాగింగ్ అనే విష సంస్కృతి వల్ల ర్యాగింగ్ కు గురైన విద్యార్థి మానసిక వేదనకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు.ఇలాంటి సంఘటనలు జరుగుతుండడం దురదృష్టకరమని,తోటి విద్యార్థుల పట్ల నైతికత లేకుండా ప్రవర్తించడం మంచి పద్ధతి కాదని ఆవేదన వ్యక్తం చేశారు.
ర్యాగింగ్ కు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని,క్రిమినల్ కేసులలో ఉన్న విద్యార్థులకు భవిష్యత్తులో చదువు విషయంలోనూ,విదేశాలకు వెళ్లే విషయంలోనూ,ప్రభువా ఉద్యోగాలు పొందే విషయంలోనూ సమస్యలు తలెత్తి భవిష్యత్తు విచ్చిన్నమవుతుందని తెలిపారు.ప్రతి ఒక్క విద్యార్థి మొదటగా విద్యాసంస్థలో అడుగుపెడితే అతను నూతన విద్యార్థి అవుతాడని,ఇక్కడికి అందరూ అలాగే వచ్చిన వారెనని,ఆ విషయాన్ని గుర్తుంచుకొని జూనియర్లను ఆదరించాలని,వారికి వచ్చే సమస్యలను సీనియర్లుగా పరిష్కరించాలని,అంతేతప్ప సీనియర్లే వారి పట్ల సమస్య కాకూడదన్నారు.
ఏ విద్యార్థి వ్యసనాలకు బానిసై భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని, వ్యసనాలకు దూరంగా ఉండాలని చెడు అలవాటులకు దూరంగా ఉండాలని కోరారు.చట్టాలు బలోపేతం చేయబడ్డాయని,ర్యాగింగ్ పాల్పడితే ర్యాగింగ్ చట్టం ప్రకారం కఠినమైన శిక్షలు ఉంటాయని,జరిమానాలతో పాటు గరిష్టంగా 10 సంవత్సరాల వరకు జైలు శిక్షలు తప్పవని హెచ్చరించారు.
సమస్యలు వస్తే పై అధికారులకు తెలియజేయాలని,సమస్యలని తలుచుకొని కుంగిపోవద్దని ధైర్యంగా ముందుకు సాగాలని కోరారు.ప్రతి ఒక్క విద్యార్థి ఇతరులకు ఆదర్శంగా ఉండాలని,తల్లిదండ్రుల కలలను, ప్రభుత్వ ఉద్దేశ్యాన్ని నెరవేర్చాలని,మంచి విద్యార్థిగా పేరు తెచ్చుకోవాలని,కళాశాలకు,ప్రభుత్వానికి మంచి పేరు తేవాలన్నారు.
అలాగే ఇక్కడి నుండి వైద్యులుగా పట్టాలు పొంది సమాజానికి,పేదలకు మంచి సేవలు అందించాలని కోరుకుంటున్నానని అన్నారు.ఈ అవగాహన కార్యక్రమంలో డిఎస్పి నాగభూషణం,స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, సిఐ రాజశేఖర్,వైద్య కళాశాల ప్రిన్సిపాల్ శారద,జిల్లా ఆసుపత్రి సూపింటెండెంట్ మురళీధర్,కళాశాల వైస్ ప్రిన్సిపాల్ అనునై,వార్డెన్ కృష్ణయ్య,గిరిధర్,ఎస్ఐలు శ్రీనివాస్,క్రాంతి,సైదులు,జిల్లా షీ టీం సిబ్బంది తదితరులు ల్గొన్నారు.