జబర్దస్త్ కమెడియన్ సుడిగాలి సుధీర్ హీరోగా రూపొందిన గాలోడు సినిమా మొదటి రోజే కోటికి పైగా కలెక్షన్స్ ను రాబట్టింది.ఇప్పటి వరకు అయిదు కోట్లకు పైగా వసూళ్లు నమోదు అయ్యాయి.
ఈ సమయంలో కొందరు కావాలని పని గట్టుకుని గాలోడు సినిమా యొక్క కలెక్షన్స్ ని మరియు మంచు విష్ణు యొక్క జిన్నా సినిమా కలెక్షన్స్ ను పోల్చుతూ రచ్చ చేసే ప్రయత్నం చేస్తున్నారు.గతంలోనే మంచు విష్ణు తమను ప్రతి విషయంలో ట్రోల్స్ చేస్తున్నారు అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.
ఆయన అన్నట్లుగానే ఇప్పుడు గాలోడు సినిమా తో జిన్నా సినిమా యొక్క కలెక్షన్స్ పోల్చుతూ దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.ఈ విషయంలో ఇప్పటి వరకు మంచు విష్ణు స్పందించలేదు.
జిన్నా యొక్క కలెక్షన్స్ లాంగ్ రన్ లో కనీసం కోటి కూడా రాలేదు.కేవలం తెలుగు లో మాత్రమే కాకుండా సన్నీ లియోన్ పేరు చెప్పి పాన్ ఇండియా రేంజ్ లో విడుదల చేయడం జరిగింది.
అక్కడ.ఇక్కడ అన్ని చోట్ల కూడా జిన్నా సినిమా దారుణమైన కలెక్షన్స్ ను నమోదు చేయడం అందరికి ఆశ్చర్యంగా ఉంది.
అసలు ఇంత తక్కువ వసూళ్లు నిజంగా నమోదు అయ్యాయా అంటూ కొందరు కామెంట్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం జిన్నా సినిమా యొక్క కలెక్షన్స్ తో గాలోడు సినిమా యొక్క కలెక్షన్స్ ను పోల్చడం మంచు ఫ్యామిలీ మొత్తం ను అవమానించడం అంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.మంచు ఫ్యామిలీ ఫ్యాన్స్ కొందరు ఈ విషయమై మంచు విష్ణు కు మద్దతుగా నిలిచేందుకు ప్రయత్నించారు.
అయినా కూడా సోషల్ మీడియా లో మంచు ఫ్యామిలీకి వ్యతిరేకంగా జరుగుతున్న రచ్చ అంతా ఇంతా కాదు.గాలోడు సినిమా కలెక్షన్స్ విషయంలో పాజిటివ్ గా చర్చించుకుంటే పర్వాలేదు.
కానీ జిన్నా సినిమా ను ఇన్వాల్వ్ చేయాల్సిన అవసరం లేదు.ఈ పద్దతి ముందు ముందు కూడా ఏమాత్రం సరికాదంటూ కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.