అమెరికాలో ఆర్థిక మాంద్యం దెబ్బకు టెక్ దిగ్గజాలన్నీ గొల్లుమంటున్నాయి.కరోనా సమయంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి.
ఈ దిద్దుబాటు చర్యలలో భాగంగానే బడా కంపెనీలన్నీ ప్రస్తుతం ఖర్చులు తగ్గించుకునే పనిలో పడ్డాయి.దాంతో ఎక్కడ కోతలు విధించాలో గడిచిన ఏడాది నుంచి ప్రణాళిక బద్ధంగా ముందుకు వెళ్తున్న క్రమంలో కంపెనీలన్నీ ప్రస్తుతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి.
దాంతో ఎంతోమంది నిపుణులు ఆందోళన చెందుతున్నారు.ముఖ్యంగా హెచ్ -1బి వీసా పై ఉద్యోగాలు పొంది అమెరికా వెళ్లిన ప్రవాసుల పరిస్థితి అగమ్య గోచరంగా మారిపోయింది.
కాగా.
హెచ్ -1బి వీసా పై అమెరికాలో ఉద్యోగం సంపాదించిన నిపుణులు ఎవరైతే ఉన్నారో వారు ఉద్యోగాలు గనుక కోల్పోతే వారి వీసా నిబంధనల ప్రకారం 60 రోజుల్లో మరొక ఉద్యోగం సంపాదించుకుని వీసాను రెన్యువల్ చేసుకోవాలి.
అలాకాని పక్షంలో స్వదేశానికి వెళ్లిపోవాల్సి ఉంటుంది ఈ నేపథ్యంలో ఉద్యోగం కోల్పోయి హెచ్ -1బి వీసా రెన్యువల్ కోసం ఎదురుచూస్తున్న టెకి లను గట్టెక్కించేందుకు నిపుణులు కీలక సూచనలు ఇస్తున్నారు అదేంటంటే.
![Telugu America, Visa, Jobs, Lawyers, Job, Visa Renewal-Telugu NRI Telugu America, Visa, Jobs, Lawyers, Job, Visa Renewal-Telugu NRI](https://telugustop.com/wp-content/uploads/2022/11/America-H-1B-visa-jobs-visa-renewal-new-job-Lawyers.jpg )
ఇప్పటివరకు ఉద్యోగులు పెద్ద స్థాయి ఉద్యోగాలు చేసి ఉండొచ్చు అయితే ప్రస్తుతం పరిస్థితులు చక్కబడేంతవరకు శాలరీ తక్కువ ఉన్న ఉద్యోగంలో అయినా చేరడం మంచిదని సూచిస్తున్నారు ఒకవేళ ఉద్యోగం రాని పక్షంలో అమెరికా వీడి వెళ్ళాలి కానీ ఎలాంటి ఆందోళన చెందవద్దని, ఉద్యోగం కోల్పోయిన వారికి అమెరికా లాటరీ అవసరం లేకపోవడంతో త్వరగా ఉద్యోగం సంపాదించవచ్చునని , అధైర్య పడకుండా ఉద్యోగ వేటలో వేగంగా ఉండాలని స్టార్టప్ కంపెనీలైన సరే ఎలాంటి ఆలోచన చేయకుండా దరఖాస్తు చేయాలని సూచిస్తున్నారు.అలాగే ఎఫ్ -1 వీసాపై చిన్న కాలేజీల్లో చేరి మరి కొంతకాలం అమెరికాలో ఉండే అవకాశాన్ని పొందవచ్చునని, విజిటర్ వీసా కి మారి ఉద్యోగం పొందిన తర్వాత మళ్లీ హెచ్ -1బి వీసా కు మార్చుకునే అవకాశం ఉంటుందో లేదో అక్కడే ఇండో అమెరికన్స్ చెందిన లాయర్స్ ను సంప్రదించవచ్చునని సూచిస్తున్నారు.