కొంత మంది నిద్రపోతే ఎంత లేపినా లేవరు.వారిని బద్ధకస్తులని, నిద్రలో కుంభకర్ణులని కొందరు పిలుస్తుంటారు.
అయితే ఎంత గాఢ నిద్రలో ఉన్నా చెవిలో, ముక్కులో ఏదైనా దూరుతుందని భావిస్తే మనకు తెలియకుండానే స్పందిస్తాం.నిద్రలోనే అటు నుంచి నుంచి ఇటు తిరగడమో, చేతితో కొట్టడమో చేస్తుంటాం.
అయినప్పటికీ కొన్ని సందర్భల్లో కొందరికి ముక్కులోనో, చెవిలోనో ఈగలు, దోమలు, చిన్న సైజు పురుగులు దూరడం గమనించి ఉంటాం.అయితే ఓ మహిళ నోటిలోకి ఏకంగా నాలుగు అడుగుల పాము దూరిపోయింది.
వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా, ఇది నిజంగానే జరిగింది.దీనికి సంబంధించిన ఆసక్తికర విషయాలిలా ఉన్నాయి.
తమ కడుపులో ఏదో కాయిన్ మింగేశామని, స్పూన్ మింగేశామని కొందరు ఆసుపత్రుల్లో చేరడం మనం విని ఉంటాం.అయితే ఇటీవల ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళను చూసి వైద్యులు షాక్ అయ్యారు.
చివరికి ఆమెకు హుటాహుటిన ఆమెను ఆపరేషన్ థియేటర్ లోకి తీసుకెళ్లారు.ఆమె గొంతు లోపలికి లైటుతో కూడిన పైపును పంపించారు.
అతి కష్టం మీద ఆమె లోపల ఉన్న నాలుగు అడుగుల పామును బయటకు తీశారు.అది తీస్తుండగా కూడా వైద్యులు భయపడ్డారు.
ఆ పాము కాటు వేస్తుందనే భయంతో నాలుగు అడుగులు వెనక్కి వేశారు.అతి కష్టం మీద లోపలికి దూరిన పామును బయటకు తీసి, ఆ మహిళకు ప్రాణాపాయం తప్పించారు.
ఈ వీడియోను @FascinateFlix అనే ట్విట్టర్ ఖాతాలో షేర్ చేశారు.ఇది చూసిన నెటిజన్లు ఆశ్చర్యపోతున్నారు.
అంత పెద్ద పాము నోటిలో దూరిపోతుంటే ఆ మహిళ ఏం చేస్తుందని అడుగుతున్నారు.కుంభ కర్ణుడికి చెల్లెలు అయి ఉంటుందని ఫన్నీగా కామెంట్లు పెడుతున్నారు.