అనకాపల్లి జిల్లాలో బెంగాల్ టైగర్ సంచారంతో టెన్షన్ నెలకొంది, దుబ్బపాలెం గ్రామంలో పులి సంచరిస్తుంది.తాజాగా గ్రామంలోని ఓ లేగదూడను దాడి చేసి హతమార్చింది.
దీంతో చుట్టుపక్కల గ్రామ ప్రజలు తీవ్ర భయాందోళనకు గురి అవుతున్నారు.సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారులు పులి పాదముద్రలను గుర్తించారు.
సమీప గ్రామ ప్రజలు అందరూ అప్రమత్తం గా ఉండాలని సూచిస్తున్నారు.