బస్సు యాత్ర .. వైసీపీ దండ యాత్ర పై జనసేన కీలక సమావేశం ? 

ప్రస్తుతం జనసేన గురించిన చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచాలని నిర్ణయించారు.

 Bus Yatra Janasena Key Meeting On Ycp Danda Yatra ,ysrcp, Ap, Tdp, Chandrababu,-TeluguStop.com

ఇక వైసిపి ప్రభుత్వం పై నిరంతరంగా పోరాటాలు చేయాలని , ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ బలం పెంచుకోవాలని,  2024 ఎన్నికల్లో జనసేన సత్త ఏమిటో చూపించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.దీనికోసం ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలకుండా చూడడంతో పాటు , టిడిపి తో కలిసి వెళ్లి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయాలని,  ఆ తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

టిడిపి విషయంలో ఎన్ని విమర్శలు తనపై వస్తున్న లెక్కచేయకుండా పవన్ ముందుకు వెళ్తున్నారు.

జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చూడడమే ఏకైక లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్న క్రమంలో,  ఈ ఆదివారం జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు , రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి ? టిడిపి తో కలిసి ఏఏ అంశాలను గుర్తించి పోరాటం చేయాలి ?  ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్లే విషయంలో  సమస్యలను ఏవిధంగా అధిగమించాలి ఇలా అనేక అంశాలపై పవన్ ఈ సమావేశంలో చర్చించబోతున్నారట.
 

Telugu Ap, Chandrababu, Janasena Pac, Janasena, Ysrcp-Political

అలాగే త్వరలో ఏపీలో చేపట్టబోయే బస్సు యాత్ర రూట్ మ్యాప్ పైన చర్చించనున్నారు.  అలాగే ఈ యాత్రను అడ్డుకునేందుకు ఖచ్చితంగా వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని , అప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయం పైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.పవన్ ను ఉద్దేశించి వైసిపి నాయకులు వ్యక్తిగత విమర్శ చేస్తున్నా.

ఆ విమర్శలను ఏ విధంగా తిప్పి కొట్టాలి ? వైసిపి ప్రభుత్వం పై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి అనే అంశం పైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారట.మొత్తంగా ఈ ఆదివారం జరగబోయే జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో చాలా కీలక అంశాల గురించే చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు జనసేన సిద్ధమవుతుండడంతో మరో రెండు రోజుల్లో జరగబోయే ఈ సమావేశం అటు టిడిపి ఇటు వైసిపి లోను ఆసక్తి నెలకొంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube