బస్సు యాత్ర .. వైసీపీ దండ యాత్ర పై జనసేన కీలక సమావేశం ? 

ప్రస్తుతం జనసేన గురించిన చర్చ ఏపీ రాజకీయాల్లో జరుగుతుంది.ఆ పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మరింత దూకుడు పెంచాలని నిర్ణయించారు.

ఇక వైసిపి ప్రభుత్వం పై నిరంతరంగా పోరాటాలు చేయాలని , ప్రజా సమస్యలను హైలెట్ చేస్తూ బలం పెంచుకోవాలని,  2024 ఎన్నికల్లో జనసేన సత్త ఏమిటో చూపించాలనే పట్టుదలతో పవన్ ఉన్నారు.

దీనికోసం ప్రభుత్వం వ్యతిరేక ఓటును చీలకుండా చూడడంతో పాటు , టిడిపి తో కలిసి వెళ్లి ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేయాలని,  ఆ తరువాత ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలనే పట్టుదలతో ఉన్నారు.

టిడిపి విషయంలో ఎన్ని విమర్శలు తనపై వస్తున్న లెక్కచేయకుండా పవన్ ముందుకు వెళ్తున్నారు.

జగన్ మళ్ళీ ముఖ్యమంత్రి కాకుండా చూడడమే ఏకైక లక్ష్యంగా పవన్ అడుగులు వేస్తున్న క్రమంలో,  ఈ ఆదివారం జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.

ఈ సమావేశంలో ఇటీవల చోటు చేసుకున్న పరిణామాలతో పాటు , రాబోయే రోజుల్లో ప్రజల్లోకి ఏ విధంగా వెళ్లాలి ? టిడిపి తో కలిసి ఏఏ అంశాలను గుర్తించి పోరాటం చేయాలి ?  ఉమ్మడిగా కలిసి ముందుకు వెళ్లే విషయంలో  సమస్యలను ఏవిధంగా అధిగమించాలి ఇలా అనేక అంశాలపై పవన్ ఈ సమావేశంలో చర్చించబోతున్నారట.

  """/"/ అలాగే త్వరలో ఏపీలో చేపట్టబోయే బస్సు యాత్ర రూట్ మ్యాప్ పైన చర్చించనున్నారు.

  అలాగే ఈ యాత్రను అడ్డుకునేందుకు ఖచ్చితంగా వైసిపి ప్రభుత్వం ప్రయత్నిస్తుందని , అప్పుడు ఏ విధంగా ముందుకు వెళ్లాలి అనే విషయం పైన కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లు సమాచారం.

పవన్ ను ఉద్దేశించి వైసిపి నాయకులు వ్యక్తిగత విమర్శ చేస్తున్నా.ఆ విమర్శలను ఏ విధంగా తిప్పి కొట్టాలి ? వైసిపి ప్రభుత్వం పై జనాల్లో పెరుగుతున్న వ్యతిరేకతను అనుకూలంగా ఏ విధంగా మార్చుకోవాలి అనే అంశం పైన ఈ సమావేశంలో చర్చించబోతున్నారట.

మొత్తంగా ఈ ఆదివారం జరగబోయే జనసేన పొలిటికల్ యాక్షన్ కమిటీ సమావేశంలో చాలా కీలక అంశాల గురించే చర్చించి తగిన నిర్ణయాలు తీసుకుని ఆ విధంగా ముందుకు వెళ్లేందుకు జనసేన సిద్ధమవుతుండడంతో మరో రెండు రోజుల్లో జరగబోయే ఈ సమావేశం అటు టిడిపి ఇటు వైసిపి లోను ఆసక్తి నెలకొంది.

వధువునా లేదంటే బర్రెనా పరిచయం చేసింది.. ఈ వీడియోలో పోకిరి లాంటి ట్విస్ట్..?