ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లు ఎంతో ఖర్చు చేసి ఘనంగా చేస్తున్నారు.పెళ్లిళ్లు జరిగిన తర్వాత వాటి ఫోటో షూట్లకు కూడా ఎన్నో లక్షల రూపాయలు డబ్బును ఖర్చు చేస్తున్నారు.
ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లకు చేసే ఖర్చు కంటే ప్రీవెడ్డింగ్ షూట్లకు ఎక్కువగా ఖర్చు చేస్తున్నారు.ఇలాంటి షూట్ లలో సినిమాలలో కంటే అదిరిపోయేలాగా సాంగ్స్, యాక్షన్ సీన్లు రకరకాలుగా ఎవరికి నచ్చినట్లు వారు విచిత్రంగా ఇలాంటి షూట్లు చేస్తున్నారు.
ప్రస్తుత కాలంలో జరుగుతున్న ప్రీవెడ్డింగ్ షూట్ ధూమ్ 4 సినిమాలో వచ్చే సన్నివేశాల కంటే ఇంకా విచిత్రంగా ఉన్నాయని చాలామంది చెబుతున్నారు.
అయితే, పెళ్లి పీటలు ఎక్కబోతున్న ఓ కొత్తజంట తమ ప్రీవెడ్డింగ్ షూట్‌లోనే యాక్షన్ సన్నివేశాలను షూట్ చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే ఈ మధ్యకాలంలో పెళ్లిళ్లలో వీడియో షూట్ లేకపోయినా ఎవరు పట్టించుకోవడం లేదు.ప్రీవెడ్డింగ్ షూట్ మాత్రం ఉండాలనే పెళ్లి కొడుకు, పెళ్లి కూతురు ఖచ్చితంగా అనుకుంటున్నారు.
అందుకోసం ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు చేయడానికి కూడా వెనుకాడడం లేదు.ఒకప్పటి ప్రీవెడ్డింగ్ షూట్లు అంటే ఏదో రొమాంటిక్ వీడియోస్ లను షూట్ చేసేవారు.
కానీ ఈ మధ్యకాలంలో యువత ఆలోచనలు చాలా మారిపోతూ ఉన్నాయి.విచిత్రమైన ఆలోచనలతో సినిమాలలో చేసేలాగా యాక్షన్ సన్నివేశాలను కూడా షూట్ చేస్తున్నారు.
వధూవరులు ఇద్దరు పెళ్లిలో మాదిరిగా వస్త్రధారణలో బైక్‌పై కూర్చోనీ దానిని తాళ్ల సాయంతో కట్టి సుమో వాహనంపై నుంచి జంప్ చేసినట్లుగా షూట్ చేస్తున్నారు.ప్రస్తుతం వీడియో సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఈ వీడియోను బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేయగా ఒక్కరోజులోనే 77 మంది చూశారు.ఈ ప్రీవెడ్డింగ్ షూట్‌కు రోహిత్ శెట్టి డైరెక్టరా, అని కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.
ఇలాంటి ప్రీవెడ్డింగ్ షూట్ లేకుండా నేను పెళ్లి చేసుకోమని మరి కొంతమంది కామెంట్లు చేస్తున్నారు.