డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు దర్శకత్వంలో ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన సినిమా ఓరి దేవుడా.ఇందులో విశ్వక్ సేన్, మిథిలా పల్కర్, వెంకటేష్, ఆశ భట్, ప్రియదర్శన్, మురళి శర్మ, నాగినీడు తదితరులు కీలక పాత్రలో నటించారు.
ఇక ఇప్పటికే ఈ సినిమా నుండి విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ట్రైలర్ ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి.రొమాంటిక్, కామెడీ ఎంటర్టైన్మెంట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందింది.
ఇక ఈ సినిమాను పి వి పి సినిమా, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై పెరల్ వి పొట్లూరి, పరం వి పొట్లూరిలు నిర్మించారు.లియోన్ జేమ్స్ ఈ సినిమాకు సంగీతాన్ని అందించాడు.
ఇక భారీ అంచనాల నడుమ ఈ సినిమా రూపొందగా ప్రేక్షకులను ఏ విధంగా ఆకట్టుకుందో చూద్దాం.ఇక విశ్వక్ సేన్ కు ఎటువంటి సక్సెస్ వచ్చిందో చూద్దాం.
కథ:
ఇక ఇందులో విశ్వక్ సేన్ అర్జున్ పాత్రలో కనిపిస్తాడు.సినిమా మొత్తం అర్జున్ పాత్ర చుట్టూ తిరుగుతుంది.
అయితే అర్జున్, అను పాల్‌రాజ్ (మిథిలా పల్కర్) పెళ్లి చేసుకుంటారు.కానీ, పెళ్లి తర్వాత కొన్నాళ్లకే కొన్ని అపార్థాలతో వీరిద్దరూ విడిపోవాలని కోర్టు మెట్లు ఎక్కుతారు.
అలా అర్జున్ జీవితంలోకి ఒక దేవుడి ఎంట్రీ ఉంటుంది.ఇక ఆ దేవుడు అర్జున్ కు ఏమని చెబుతాడు.చివరికి అర్జున్ తన భార్యను మళ్లీ దగ్గరికి తీసుకుంటాడా లేదా అనేది మిగిలిన కథలోనిది.
నటినటుల నటన:
విశ్వక్ సేన్ నటన గురించి కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు.ఎమోషనల్ సీన్స్ లో మాత్రం అద్భుతంగా ఆకట్టుకున్నాడు.నిజానికి సినిమాను తానే భుజాల మీద మోసినట్లుగా అనిపించింది.ఇక హీరోయిన్ కూడా తన నటనతో పరవాలేదు అన్నట్లుగా నటించింది.విక్టరీ వెంకటేష్, రాహుల్ రామకృష్ణ నటన మాత్రం మరింత హైలెట్ అని చెప్పవచ్చు.
మిగతా నటీనటులంతా తమ పాత్రలకు న్యాయం చేశారు.
టెక్నికల్:
టెక్నికల్ పరంగా డైరెక్టర్ అశ్వత్ మరిముత్తు.ఈ కథను అద్భుతంగా చూపించాడు.ప్రతి ఒక్క సన్నివేశాన్ని చాలా ఆసక్తిగా చూపించాడు.
సినిమాటోగ్రఫీ చాలా బాగుంది.సంగీతం కూడా బాగా ఆకట్టుకుంది.
ఇక మిగతా టెక్నికల్ విభాగాలు తమ పనులను న్యాయంగా చూపించారు.
విశ్లేషణ:
ఇక ఈ సినిమా మంచి ఎంటర్టైన్మెంట్ సినిమా అని చెప్పవచ్చు.ఈ మధ్యకాలంలో వచ్చిన సినిమాలకు భిన్నంగా ఉంది ఈ సినిమా.ఇక మంచి కామెడీ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది కాబట్టి సినిమా ఖచ్చితంగా చూడవచ్చు.
మధ్యలో వెంకటేష్ ఎంట్రీ తో కథ మరింత ఆసక్తిగా మారుతుంది.
ప్లస్ పాయింట్స్:
స్క్రీన్ ప్లే అద్భుతంగా ఉంది.నటీనటుల నటన.మ్యూజిక్ బాగా ఆకట్టుకుంది.కామెడీ కూడా బాగుంది.సినిమాటోగ్రఫీ కూడా పరవాలేదు.
మైనస్ పాయింట్స్:
వి ఎఫ్ ఎక్స్ అంతగా ఆకట్టుకోలేకపోయింది.కొన్ని సన్నివేశాలు సాగదీసినట్లు అనిపించాయి.
బాటమ్ లైన్:
చివరిగా చెప్పాల్సిందేంటంటే.ఈ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని చెప్పవచ్చు.కామెడీ ఎంటర్టైన్మెంట్ తో ఈ సినిమా ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది.