సాధారణంగా పెంపుడు జంతువులను కొనుగోలు చేయడం కంటే వీధుల్లో ఎన్నో అవస్థలు పడుతున్న వాటిని దత్తత తీసుకోవడం మేలని జంతు ప్రేమికులు చెబుతుంటారు.అయినా ఇండియాలో చాలా మంది విదేశీ కుక్కలను కొనుగోలు చేస్తూ వీధి కుక్కలను అసలు అడాప్ట్ చేసుకోవడం లేదు.
అయితే తాజాగా కెనడా నుంచి వచ్చిన దంపతులు మాత్రం ఒక భారతీయ వీధి కుక్కను దత్తత తీసుకున్నారు.మొన్నటిదాకా స్థానిక ప్రజల నుంచి హింస, ఆకలి మంట, నిరాశ్రయురాలైన ఈ కుక్కని వారు తమ ఇంటికి ఆప్యాయంగా ఆహ్వానించారు.
అనంతరం దానికి ఒక మంచి లైఫ్ ఇచ్చారు.దీనికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది.
ఇన్‌స్టాగ్రామ్ యూజర్ @havillahheger ఈ వీడియోను అప్‌లోడ్ చేశారు.ఈ వీడియోలో కుక్కను దత్తత తీసుకున్న వారి ప్రయాణాన్ని చూడవచ్చు.
వైరల్ వీడియో ఓపెన్ చేయగానే కెనడియన్ కపుల్ భారతదేశ డాగ్‌ని కలుసుకోవడానికి విమానాశ్రయానికి కారులో వెళ్లడం చూడవచ్చు.అప్పటికే విమానాశ్రయానికి కుక్క సురక్షితంగా చేరుకుంటుంది.వారు కుక్కను తీసుకున్న తర్వాత దానిని తిరిగి ఇంటికి తీసుకెళ్తారు.కొత్త వాతావరణంలో కొత్త మనుషుల మధ్య కుక్క చాలా భయంగా ఫీల్ అయింది.
ఫుడ్ అందిస్తూ చాలా సేపు దువ్విన తరువాత అది తన పంజరంలో నుంచి బయటకు వచ్చింది.అనంతరం తన కొత్త యజమానులతో అది కలిసిపోయింది.
ఈ వీడియోకి 6 లక్షల కంటే ఎక్కువ వ్యూస్ వచ్చాయి.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.“నేను భారతదేశానికి చెందినవాడిని.రోజూ చాలా కుక్కలు రోడ్లపై కష్టాలు పడటం చూస్తున్నాను.
మీరు ఒక వీధి కుక్కను పెంచుతున్నందుకు నేను సంతోషిస్తున్నాను.ధన్యవాదాలు.” అని ఒక యూజర్ కృతజ్ఞతలు తెలుపుకున్నారు.ఈ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.