మునుగోడు ఎన్నికలకు రద్దు చేసిన గుర్తు తిరిగి కేటాయింపు

కేంద్ర ఎన్నికల సంఘం బుధవారం అనూహ్య నిర్ణయం తీసుకొన్నది.గతంలో రద్దు చేసిన రోడ్డు రోలర్‌ గుర్తును మునుగోడు ఉప ఎన్నికలో స్వతంత్ర అభ్యర్థికి తిరిగి కేటాయిస్తూ ఆదేశాలిచ్చింది.

 Re-allotment Of Canceled Symbol For Previous Election-TeluguStop.com

గుర్తుల కేటాయింపు లో నిబంధనలను పాటించలేదని పేర్కొంటూ మునుగోడు ఉప ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి జగన్నాథరావును బదిలీ చేసింది.ఆయన స్థానంలో హుటాహుటిన మిర్యాలగూడ ఆర్డీ వో రోహిత్‌సింగ్‌ను రిటర్నింగ్‌ అధికారిగా నియమించింది.

తక్షణమే బాధ్యతలు తీసుకోవాలని కూడా ఆదేశించింది.ఈసీ ఆదేశాల మేరకు మిర్యాలగూడ ఆర్డీవో రోహిత్‌సింగ్‌ బుధవారమే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ రిటర్నింగ్‌ అధికారిగా బాధ్యతలు స్వీకరించారు.

దీంతోపాటు ‘యుగ తులసి పార్టీ’ అభ్యర్థి కే శివకుమార్‌కు ఈనెల 17న జగన్నాథరావు కేటాయించిన ‘బేబీ వాకర్‌’ గుర్తును రద్దు చేసింది.తాజాగా సదరు అభ్యర్థికి ‘రోడ్డు రోలర్‌’ గుర్తును కేటాయించారు.

రోడ్డు రోలర్‌ గుర్తుతో బ్యాలెట్‌ పేపర్లను (ఫారం-7ఏ) కూడా ముద్రించాలని ఎన్నికల సంఘం ఆదేశించింది.‘యుగ తులసి పార్టీ’ అభ్యర్థిగా పోటీచేస్తున్న కే శివకుమార్‌ గుర్తు విషయంలో తలెత్తిన వివాదంపై వివరణ ఇవ్వాలని కూడా ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని, రిటర్నింగ్‌ అధికారిగా పనిచేసిన జగన్నాథరావును సీఈసీ ఆదేశించింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube