విశాఖలో హయగ్రీవ భూముల ఆక్రమణపై ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.హయగ్రీవ భూములను రాష్ట్ర ప్రభుత్వం ఆక్రమిస్తోందని జనసేన నేత మూర్తి యాదవ్ కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలో ఈ పిటిషన్ పై విచారణ జరిపిన న్యాయస్థానం కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు ఇచ్చింది.అదేవిధంగా ప్రతి వాదులకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది.
అనంతరం తదుపరి విచారణను మూడు వారాలకు వాయిదా వేసింది.