ఊహలు గుసగుసలాడే సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచయమయ్యారు నటి రాశిఖన్నా.ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎన్నో సినిమాలలో నటించి ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న ఈమె ప్రస్తుతం తెలుగు తమిళ సినిమాలతో పాటు హిందీ వెబ్ సిరీస్ ల తో కూడా ఎంతో బిజీగా ఉన్నారు.
వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉండే రాశి ఖన్నా సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటారు.అయితే తాజాగా ఈమె పక్కా కమర్షియల్ థాంక్యూ వంటి సినిమాల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు.
ఈ సినిమాలు అనుకున్న స్థాయిలో ఆదరణ సంపాదించుకోలేకపోయాయి.ఈ క్రమంలోనే ఈమె తన తదుపరి సినిమాల పై పూర్తి దృష్టి సారించారు.
ఇకపోతే సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్ గా ఉండే రాశి కన్నా తాజాగా ఒక బ్యూటిఫుల్ ఫోటోని సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు.రాశి షేర్ చేసిన ఈ ఫోటో అచ్చం దేవకన్యను తలపించడంతో ఈ ఫోటో క్షణాల్లో వైరల్ గా మారుతుంది.
ఈ ఫోటో చూసిన ఎంతోమంది కుర్రకారులు తమదైన శైలిలో రాశిఖన్నా అందంపై కామెంట్లు చేస్తున్నారు.
ఇలా నేటిజన్స్ మాత్రమే కాకుండా హాట్ బ్యూటీ పాయల్ రాజ్ పుత్ సైతం రాశి ఖన్నా ఫోటో పై స్పందిస్తూ చేసినటువంటి కామెంట్స్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.ఈ క్రమంలోనే రాశిఖన్నాని ఇంత అందంగా చూసి మనసు ఆపుకోలేకపోయింది.అచ్చం యువరాణిలా ఉన్నావు నీ డ్రెస్ కొట్టేస్తా అంటూ రాశిఖన్నా ఫోటో పై స్పందిస్తూ పాయల్ స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మొత్తానికి యువరాణిలా ఉన్నటువంటి రాశి ఖన్నా ఫోటో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతుంది.