తెలుగు సినీ ప్రేక్షకులకు సింగర్ రేవంత్ గురించి ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు.రేవంత్ తెలుగులో ఎన్నో సినిమాలకు పాటలు పాడి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకున్న విషయం తెలిసిందే.
అయితే సింగర్ కావడానికి రేవంత్ చాలా కష్టపడ్డాడు.మొదట బుల్లితెరపై కంటెస్టెంట్ గా పాల్గొన్నాడు.
ఇక ఆ తర్వాత 2017లో తాను పాడిన పాటలకు ఇండియన్ ఐడల్ లో విజేతగా నిలిచాడు.తరువాత పలు సింగింగ్ కాంపిటిషన్స్ కి మెంటర్ గా వ్యవహరించాడు.
అంతే కాకుండా ఇప్పటివరకు దాదాపు 100కు పైగా పాటలు పాడి సింగర్ గా మంచి గుర్తింపు ఏర్పరచుకున్నాడు రేవంత్.
ఇకపోతే సింగర్ రేవంత్ ప్రస్తుతం బిగ్బాస్ హౌస్ లో కంటెస్టెంట్ గా రాణిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే.
ప్రస్తుతం తెలుగులో ప్రసారమవుతున్న బిగ్ బాస్ సీజన్ 6 లో కంటెస్టెంట్ గా రాణిస్తున్నాడు రేవంత్.అయితే మొదటి వారం నుంచి టాస్క్ ల విషయంలో గొడవల విషయంలో యాక్టివ్ గా ఉంటూనే ప్రస్తుతం బిగ్ బాస్ కంటెస్టెంట్లలో అందరికంటే టాప్ లో ఉన్నాడు.
అంతేకాకుండా ఈసారి బిగ్ బాస్ సీజన్ 6 విజేతగా సింగర్ రేవంత్ గెలుస్తాడు అని చాలామంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.అందుకు అనుగుణంగానే బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ ఎప్పుడు నామినేషన్ లో ఉన్నా కూడా ఓటింగ్ లో మొదటి స్థానంలో ఉంటున్నాడు.

ఇలా ఉంటే ప్రస్తుతం సోషల్ మీడియాలో సింగర్ రేవంత్ రెమ్యూనరేషన్ గురించి ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది.ఇది బిగ్ బాస్ హౌస్ లో రేవంత్ రోజుకి 60 వేల నుంచి 70 వేల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటున్నట్లుగా వార్తలు వినిపిస్తున్నాయి.అంతేకాకుండా ప్రస్తుతం హౌస్ లో ఉన్న అందరికంటే రేవంత్ ని ఎక్కువ రెమ్యూనరేషన్ అందుకుంటున్నట్లు జోరుగా వార్తలు వినిపిస్తున్నాయి.ఈ సీజన్ లో చివర వరకు ఉండేవాళ్ళలో రేవంత్ టాప్ -5 లో ఉంటాడని ప్రేక్షకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.
కొందరి మాత్రం తప్పకుండా విజేతగా నిలుస్తాడు అని అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.