ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్ గా ట్యాలెంటెడ్ డైరెక్టర్ సుకుమార్ దర్శత్వంలో తెరకెక్కిన సినిమా పుష్ప ది రైజ్.ఈ సినిమా తర్వాత అల్లు అర్జున్ రేంజ్ మారిపోయింది అనే చెప్పాలి.
ఎందుకంటే పుష్ప సినిమాతో ఉత్తరాది ప్రేక్షకుల మనసులో స్థిరమైన స్థానాన్ని ఏర్పరచు కున్నాడు.ఒక్క సినిమా తోనే ఐకాన్ స్టార్ పాన్ ఇండియా స్టార్ గా ఎదిగాడు.
ఈ సినిమా పార్ట్ 1 సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 తెరకెక్కించేందుకు మేకర్స్ సన్నాహాలు చేస్తున్నారు.పార్ట్ 1 ఎటువంటి హంగులు, ఆర్భాటాలు లేకుండానే రిలీజ్ అయ్యి సంచలన విజయం సాధించడంతో ఇప్పుడు పార్ట్ 2 పై భారీ అంచనాలే పెరిగాయి.
ఫ్యాన్స్ కూడా ఈ సినిమా కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు.అందుకే సుకుమార్ కూడా తొందర పడకుండా పక్క ప్లానింగ్ తో మరింత పక్కాగా స్క్రిప్ట్ తో బరిలోకి దిగుతున్నాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పుడు అప్పుడు అంటూ జులై ఆగష్టు నుండి చెబుతూనే ఉన్నారు.కానీ ఇంత వరకు సెట్స్ మీదకు వెళ్ళలేదు.
ఎందుకు సెట్స్ మీదకు వెళ్లడం లేదో తెలియదు కానీ ఈ సినిమా మాత్రం రోజురోజుకూ ఆలస్యం అవుతూనే ఉంది.సెప్టెంబర్ అన్నారు అది జరగలేదు.
ఇక మొన్నటి వరకు అక్టోబర్ లో రెగ్యురల్ షూట్ స్టార్ట్ అవ్వడం ఖాయం అన్నారు.కానీ ఈ నెల కూడా షూట్ స్టార్ట్ అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.
అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా ఫైనల్ గా వచ్చే నెల నవంబర్ నుండి రెగ్యురల్ షూట్ కు వెళ్లనుంది అని క్లారిటీ వస్తుంది.మరి ఇది అయినా నిజం అవుతుందో లేదో చూడాలి.మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.ఈ సినిమా స్టార్ట్ అయితే బ్రేక్స్ లేకుండా పూర్తి చేసి వచ్చే ఏడాది చివర్లోనే ప్రేక్షకుల ముందుకు తీసుకు రావాలని ప్లాన్ చేస్తుందట.
చూడాలి వచ్చే ఏడాది లోనే రిలీజ్ కు సాధ్యం అవుతుందో లేదో.