ఆధ్యాత్మిక గురువు పరమ పూజ్య శ్రీ మాతాజీ నిర్మలా దేవి శత జయంతి ఉత్సవాల సందర్భంగా సహజ యోగ ట్రస్ట్ వారి ఆధ్వర్యంలో ది॥ 21-03-2022 నుండి 21-03-2023 వరకు దేశ వ్యాప్తంగా శత జయంతి ఉత్సవాలను ఘనంగా జరుపుతున్నారని తెలిపారు .దీంట్లో భాగంగా ఖమ్మం నగరంలో సెప్టెంబర్ 18 ఆదివారం సా॥ 6:00 గం॥లకు సర్దార్ పటేల్ స్టేడియం పక్కన ఎస్.ఆర్ & బిజి.ఎన్.ఆర్ గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ గ్రౌండ్ ప్రాంతంలో ఉచితంగా సహజ యోగ ధ్యానం పరిచయ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు .కావున పట్టణ ప్రజలందరూ సద్వినియోగం చేసుకొని సంపూర్ణ ఆరోగ్యం , మానసిక ఒత్తిడి నుండి ప్రశాంతమైన జీవితం పొంది ఆనందమయ జీవనం కొనసాగించాలని కోరారు .శ్రీ మాతాజీ జన్మ స్థలం అయిన మధ్య ప్రదేశ్ రాష్ట్రంలోని చింద్వాడ పట్టణం నుండి బయలు దేరి వివిధ రాష్ట్రాల గుండా పర్యటించి ఆగస్టు 15 వ తేదీన తెలంగాణ రాష్ట్రంలోకి ప్రవేశించి 45 రోజుల పాటు వివిధ జిల్లాలలో , మండలాలలో , గ్రామలలో పర్యటిస్తూ సహజ యోగ ధ్యాన పద్ధతిపై అవగాహన కలిపిస్తుందని పేర్కొన్నారు .
ఇప్పటికే సుమారు 120 దేశాలలో లక్షలాది మంది ప్రజలు సహజయోగ సాధన ద్వారా తమ జీవితాలను ఆనందమయం చేసుకుంటున్నారు అని అన్నారు .విద్యార్థులు , ఉద్యోగస్థులు , వ్యాపారస్థులు , మహిళలు ఎవరైనా సరే నేటి ఆధునిక సమాజంలో ఇంట్లో మరియు బయట ఎంతో ఒత్తిడి , శ్రమ వలన దైనందిన జీవితంలో ఎదుర్కొంటున్న శారీరక , మానసిక , భావోద్వేగ సమస్యలకు సహజ యోగ ధ్యాన సాధనయే సరైన పరిష్కారము అని అనుభవ పూర్వకంగా తెలుసుకున్నారన్నారు .ప్రకృతి సంపదను మెరుగు పర్చుకోవచ్చును .నాణ్యమైన పంట , అధిక దిగుబడులతో వ్యవసాయంను లాభ సాటిగా చేసుకోవచ్చును .మద్యపానం , మాదక ద్రవ్యాల భారీ నుండి బయటపడటానికి ఇది ఒక మార్గమని , విద్యార్థులలో, యువతలో నైతికతను , ధార్మికతను , జ్ఞాపక శక్తిని , సృజనాత్మక శక్తిని మెరుగుపరుస్తుందన్నారు .పరమపూజ్య శ్రీ మాతాజీ “ఆత్మసాక్షాత్కారమే మానవుని అంతిమ గమ్యం” అని నిరూపించి జాతి , మత , కుల , ప్రాంతాలకు అతీతంగా మానవాళి సంక్షేమమే ధ్యేయంగా సహజయోగాన్ని ప్రపంచానికి పరిచయం చేశారన్నారు .ఈ కార్యక్రమంలో వైస్ ప్రసిడెంట్ ఉదయ్ శంకర్ , ప్రాజెక్టు మేనేజర్ k.ప్రియాంక , ఇంజనీర్ CH.తేజ రెడ్డి , సొల్యూషన్స్ ఆర్కిటెక్ట్ G.V రవికుమార్ తదితరులు పాల్గొన్నారు .