సాఫ్ట్ లవ్ స్టోరీతో ఇండస్ట్రీ ఎంట్రీకి సిద్ధమైన మోక్షజ్ఞ.. సినిమా టైటిల్ కూడా ఫిక్స్!

ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ హీరోల వారసులు ఎంట్రీ ఇచ్చి ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటిస్తూ ఇండస్ట్రీలో హీరోలుగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నారు.60 సంవత్సరాల సినీ ప్రస్థానం ఉన్నటువంటి నందమూరి కుటుంబం నుంచి ఇప్పటికే ఎన్టీఆర్ కళ్యాణ్ రామ్ వంటి వారు ఇండస్ట్రీలో కొనసాగుతుండగా, నందమూరి అభిమానులు బాలకృష్ణ కుమారుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు.అయితే ఇప్పటికే మోక్షజ్ఞ ఎంట్రీ ఇవ్వబోతున్నారంటూ గతంలో పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి.

 Nandamuri Mokshagna Tollywood Entry With Soft Love Story Details, Mokshajna,soft-TeluguStop.com

బాలకృష్ణ నటించినటువంటి గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా సమయంలోనే మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందంటూ వార్తలు షికార్లు చేశాయి.

అయితే మోక్షజ్ఞను ఇండస్ట్రీకి లాంచ్ చేయబోయే దర్శకుడు ఇతనే అంటూ ఎస్ఎస్ రాజమౌళి, బోయపాటి శ్రీను, వివి వినాయక్, పూరి జగన్నాథ్, కొరటాల శివ వంటి డైరెక్టర్ల పేర్లు కూడా వినిపించాయి.చివరికి అనిల్ రావిపూడి పేరు కూడా ఈ లిస్టులోకి చేరిపోయింది.

అయితే ఇలా మోక్షజ్ఞ ఎంట్రీ గురించి వచ్చిన ఈ వార్తలన్నీ పూర్తిగా అవాస్తవమని తేలిపోయింది.ఇక మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు.

Telugu Balakrihna, Kalyan Ram, Mokshajna, Nandamuri Fans, Soft Love Story, Tolly

ఇదిలా ఉండగా తాజాగా మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి మరోసారి వార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.అయితే ఈసారి మోక్షజ్ఞ ఎంట్రీ మాత్రం పక్కా ఉండబోతుందని సమాచారం.ఇక మోక్షజ్ఞను నాని హీరోగా నటించిన శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యనన్ మోక్షజ్ఞను గ్రాండ్ గా ఇండస్ట్రీకి లాంచ్ చేయబోతున్నారని సమాచారం.ఇప్పటికే మోక్షజ్ఞ కోసం రాహుల్ అద్భుతమైన సాఫ్ట్ లవ్ స్టోరీ సిద్ధం చేశారని ఈ సినిమాకి ప్రేమించి చూడు అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారని వార్తలు వినపడుతున్నాయి.

ఇక ఈ విషయంపై అధికారిక ప్రకటన మాత్రమే తెలియాల్సి ఉంది.ఇదే కనుక నిజమైతే నందమూరి అభిమానులు ఆనందానికి అవధులు ఉండవని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube