స్టార్ హీరో విక్రమ్ నటించిన కోబ్రా సినిమా తెలుగు లో భారీ ఎత్తున విడుదల చేసేందుకు ప్రయత్నాలు చేశారు.సినిమా విడుదల అయ్యే సమయం వరకు కూడా తెలుగు ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తించడం లో విఫలమైంది.
తమిళం లో విక్రమ్ సినిమా అంటే ఒక మోస్తరు నుండి భారీ అంచనాలు ఉంటాయి.తెలుగు లో ఒకప్పుడు విక్రమ్ సినిమా అంటే అంచనాలు ఉండేవి కానీ ఇప్పుడు లేవు.
గతం లో వచ్చిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద అట్టర్ ప్లాప్ అవ్వడం వల్ల ఇప్పుడు ఆయన సినిమాలకు తెలుగు మార్కెట్ లేకుండా పోయింది.కోబ్రా సినిమా తో మళ్ళీ విక్రమ్ తన పూర్వవైభవాన్ని చాటుకుంటాడని అంతా నమ్మకం వ్యక్తం చేశారు, కానీ తాజాగా వచ్చిన కోబ్రా సినిమా డిజాస్టర్ టాక్ ని తెలుగు రాష్ట్రాల్లో సొంతం చేసుకుని కనీసం కోటి రూపాయల షేర్ ని కూడా ఈ సినిమా రాబట్ట లేకపోయింది అంటూ బాక్సాఫీస్ వర్గాల నుండి గుసగుసలు అనిపిస్తున్నాయి.
ప్రమోషన్ కోసం పబ్లిసిటీ కోసం కాస్త ఎక్కువ వసూళ్లని చూపించే ప్రయత్నం చేస్తున్నారు.కానీ అసలు విషయం మాత్రం చాలా తక్కువగా వసూలు నమోదయ్యాయి.ఈ సినిమా ప్రభావం తో విక్రమ్ ఇక నుండి తెలుగులో తన సినిమాలను విడుదల చేయకపోవడం మంచిది అంటూ చాలా మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఆయన సినిమాలను టీవీల్లో లేదా డిజిటల్ ప్లాట్ఫారం ద్వారా చూస్తాం తప్పితే ఇక నుండి ఆయన సినిమాలను థియేటర్లో చూడాలని కోరుకోవడం లేదంటే చాలా మంది కోబ్రా సినిమా చూసిన తర్వాత మాట్లాడుకుంటున్నారట.
ఈ విషయంలో విక్రమ్ అభిమానులు కూడా ఒకింత నిరుత్సాహంతోనే ఉన్నారు.ఆయన నటించిన ఎన్నో సినిమాలు విజయాన్ని సొంతం చేసుకోగా ఈ సినిమా మాత్రం నిరాశపర్చడంతో వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
విక్రమ్ ముందు ముందు అయినా తెలుగులో సక్సెస్ లను దక్కించుకుంటాడేమో చూడాలి.