ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద అర్హులైన రైతులకు ఈకేవైసీ తప్పనిసరి అని కేంద్రం తెలిపింది.అయితే ఈ పథకం కింద నిధులు పొందడానికి రైతులు ఈకేవైసీ చేసుకోవాల్సింది.
దీనికి ఇంకా మూడు రోజులు మాత్రమే గడవు ఉందని కేంద్రం పేర్కొంది.పీఎం కిసాన్ పథకం కింద లబ్ధి పొందే రైతులు ఆగస్ట్ 31వ తేదీలోగా ఈకేవైసీ ఫార్మాలిటీని పూర్తి చేసుకోవాలని సూచించింది.
గతంలో జులై 31 వరకు చివరి తేదీని ప్రకటించిన కేంద్రం ఆ గడవును ఆగస్ట్ 31వ తేదీ వరకు పొడిగించింది.