విద్యార్థుల ఆర్థిక అవసరాలను తీర్చడానికి రూపొందించినదే స్టూడెంట్ క్రెడిట్ కార్డ్.వడ్డీ రహిత కాలం, రివార్డ్ సంపాదన, తగ్గింపులు వంటివి క్రెడిట్ కార్డు యొక్క ప్రాథమిక లక్షణాలు.18 ఏళ్లు పైబడిన కళాశాల విద్యార్థులు స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.దీని కోసం ఆదాయ పత్రాలు అవసరం లేదు.
ఈ క్రెడిట్ కార్డును దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు ఎవరు?.ఎలా దరఖాస్తు చేసుకోవాలి?.దరఖాస్తు చేసుకోవడానికి ఎలాంటి అర్హతలు ఉండాలి? అన్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం అర్హతలు ఎంటీ?
బ్యాంక్ క్రెడిట్ కార్డు పొందాలంటే ఆదాయం ఉండాలి.కానీ విద్యార్థులకు సాధారణంగా సంపాదన ఉండదు.అయితే విద్యార్థులకు అందించే ఈ క్రెడిట్ కార్డులకు ఆదాయ అర్హత అవసరం లేదు.స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసుకోవడానికి మాత్రం కొన్ని అర్హతలు ఉండాలి.విద్యార్థ కచ్చితంగా 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
ఈ అర్హత ప్రమాణాలు ఒక్కో బ్యాంకుకు భిన్నంగా ఉండవచ్చు.భారత దేశంలో స్టూడెంట్ క్రెడిట్ కార్డు ఆఫర్లు చాలా పరిమితంగా ఉంటాయి.
అయితే, బ్యాంకులు విద్యార్థి రుణాలు, సెక్యూర్డ్ క్రెడిట్ కార్డులు, స్టూడెంట్ ఫారెక్స్ కార్డుల రూపంలో విద్యార్థులకు ఆర్థికంగా సహాయపడుతున్నాయి.
స్టూడెంట్ క్రెడిట్ కార్డుకు కావాల్సిన పత్రాలు:
విద్యార్థి క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు చేసినప్పడు విద్యార్థులు ఈ కింది డాక్యుమెంట్లను సమర్పించాలి.1.PAN కార్డు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైన ఇతర ఫొటో ఐడీ కార్డు.2.ఆధార్ కార్డు లేదా ప్రభుత్వం ఆమోదించిన ఏదైన ఇతర అడ్రస్ ఫ్రూఫ్.3.జనన ధ్రువీకరణ పత్రం.4.కళాశాల గుర్తింపు కార్డు లేదా కాలేజీలో చదువుతున్నట్లు యాజమాన్యం అందించే ఎన్ రోల్ మెంట్ పత్రం.5.పాస్ పోర్ట్ సైజ్ ఫొటోలు.
స్టూడెంట్ క్రెడిట్ కార్డుకు ఎలా దరఖాస్తు చేసుకోవాలి?

స్టూడెంట్ క్రెడిట్ కార్డు కోసం దరఖాస్తు ప్రక్రియ విద్యార్థి ఏ క్రెడిట్ కార్డు కోసం అప్లయి చేస్తున్నాడనే దానిపై ఆధారపడి ఉంటుంది.కొన్ని బ్యాంకులు ఫిక్స్ డ్ డిపాజిట్ ఉన్న వారికి మాత్రమే కార్డు ఇస్తున్నాయి.మరికొన్ని బ్యాంకులు విద్యా రుణం ఉన్న వారికి అందిస్తున్నాయి.
ఈ కార్డు ప్రయోజనాలు ఏంటీ?
1.సాధారణ కార్డుల కంటే ఈ స్టూడెంట్ క్రెడిట్ కార్డులకు ఇచ్చే మొత్తం తక్కువ.ఈ కార్డులపై విద్యార్థులకు పరిమితి ఉంటుంది.రూ.15 వేలు మాత్రమే ఇస్తారు.దీంతో విద్యార్థులు తమ పరిమితికి మించకుండా నియత్రించబడతారు.2.ఈ కార్డులను 5 సంవత్సరాల కాల పరిమితితో అందిస్తారు.3.విద్యార్థులు తమ క్రెడిట్ కార్డును పొగొట్టుకుంటే.వారికి డూప్లికేట్ కార్డును ఇస్తారు.అందుకోసం నామమాత్రపు ఛార్జీలను వసూలు చేస్తారు.4.స్టూడెంట్ క్రెడిట్ కార్డులతో చేసే ఖర్చుపై బ్యాంకులు క్యాష్ బ్యాక్, రివార్డు పాయింట్లు కూడా ఇస్తాయి.5.ఒక వేళ విద్యార్థులు తమకు సాధారణ క్రెడిట్ కార్డు కావాలనుకుంటే.అందుకు కావాల్సిన ధ్రువపత్రాలను అందించి తమ స్టూడెంట్ క్రెడిట్ కార్డును అప్ గ్రేడ్ చేసుకోవచ్చు.