అధికారుల తీరుపై నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.పేదవారికి సొంత ఇళ్లు కట్టించాలనే సంకల్పంతో.
సీఎం జగన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా జగనన్న కాలనీలు ఇచ్చారన్నారు.కానీ కాలనీలు నివాస యోగ్యంగా లేకపోవడంతో.
ఆ విషయాన్ని అధికారుల దృష్టికి ఎన్నోసార్లు తీసుకెళ్లారు.ఈ క్రమంలో అధికారుల తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డ ఎమ్మెల్యే కోటంరెడ్డి.
మూడు నెలల్లో పనులు పూర్తి చేయాలని చెప్పారు.లేని పక్షంలో గాంధీగిరిలో నిరసన కార్యక్రమం చేపడతానని తెలిపారు.
సీఎం జగన్ ఆశయాలకు అధికారులు తూట్లు పొడిస్తే చూస్తూ ఊరుకోనేది లేదని ఆయన స్పష్టం చేశారు.