ఈ రోజుల్లో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు సర్ది చెప్పలేక వారికి ఫోన్ ఇచ్చేస్తున్నారు.స్కూల్ నుంచి రాగానే టీవీకో లేదా ఫోన్ కో అత్తుక్కుంటుంటే అడ్డు చెప్పడం లేదు.
అలా కాకుండా పిల్లలకు చిన్న యాక్టివిటీస్ చేయిస్తుండాలి.వారిలో క్రియేటివిటీ పెరిగేలా ప్రోత్సహించాలి.
ఎందుకంటే చిన్న వయసులో మెదడు అతివేగంగా కొత్త వస్తువులను, అంశాలను గురించి తెలుసుకోవడమే కాక.వాటిని స్టోర్ చేసుకుంటుంది.పిల్లలు చురుగ్గా కూడా తయారవుతారు.అందుకోసం ఇంట్లోనే ఖాళీగా పడేసిన పడేసిన ప్లాస్టిక్ బాటిళ్లు బాగా ఉపయోగపడతాయి.మరీ అలా ప్లాస్టిక్ బాటిల్ విమానాన్ని ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం.
ప్లాస్టిక్ బాటిల్ తో విమానం తయారు చేసే పద్ధతి:
ఫస్ట్ ఒక అట్ట పెట్టెను తీసుకోవాలి.దానిని విమానం రెక్కల్లాగా చిన్న ముక్కలుగా కత్తిరించుకోవాలి.తర్వాత ఒక అరలీటర్ ప్లాస్టిక్ బాటిల్ తీసుకోవాలి.ఆ బాటిల్ వెనుక, మధ్యలో రెండు పక్కలా రెక్కలు పట్టేంత కత్తిరించుకోవాలి.ఆ తర్వాత అట్ట రెక్కలను గమ్ తో బాటిల్ కత్తిరించిన చోట అతికించాలి.
బాటిల్ మూతకు చిన్న రంధ్రం చేసుకోవాలి అక్కడ ఒక చిన్న ఫ్యాన్ పెట్టుకోవాలి.అంతే విమానం రెడీ అయినట్లే.
తర్వాత దారంతో కట్టి గాలికి వదిలేస్తే చాలు విమానం తిరుగుతుంది.

పెన్సిల్ బాక్స్ చేసుకోవడం ఎలా?
రెండు ప్లాస్టిక్ బాటిళ్లను తీసుకోవాలి.ఒక బాటిల్ మూతను పెన్సిల్ పొడువు సైజులో కత్తిరించుకోవాలి.మరొక బాటిల్ కింది భాగాన్ని కొంచెం చిన్నగా కత్తిరించాలి.
తర్వాత పాత బ్యాగ్ జిప్ తీసుకోవాలి.దానిని రెండు బాటిళ్లను కలుపుతూ గమ్ తో అతికించాలి.అంతే! అలా తయారు చేసిన దాన్ని పెన్సిల్ బాక్స్, స్కెచ్ పెన్ బాక్స్ గా ఉపయోగించుకోవచ్చు.