మన ఊరు – మన బడి కార్యక్రమం క్రింద జిల్లాలో చేపట్టిన పాఠశాలల అభివృద్ధి పనులపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి త్వరితగతిన పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వి.పి.
గౌతమ్ అన్నారు.మంగళవారం కలెక్టరేట్ లోని ప్రజ్ఞ సమావేశ మందిరంలో అధికారులతో మన ఊరు – మన బడి పనుల పురోగతిని కలెక్టర్ సమీక్షించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, జిల్లాలో మొదటి విడత క్రింద 426 పాఠశాలలు ఎంపిక చేసి, పూర్తిస్థాయిలో అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు.390 పాఠశాలల్లో పనులు గ్రౌండింగ్ చేయగా, 36 చోట్ల ఇంకనూ గ్రౌండింగ్ కాలేదని ఆయన అన్నారు.ఇట్టి పాఠశాలల్లో 372 గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు ఆయన అన్నారు.71 పాటశాలల్లో ఉపాధిహామీ క్రింద పనులు గ్రౌండింగ్ అయినట్లు ఆయన తెలిపారు.విద్యార్థులకు ప్రభుత్వ పాఠ్య పుస్తకాల పంపిణీ వెంటనే పూర్తి చేయాలన్నారు.ఏకరూప దుస్తులు త్వరితగతిన అందించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు.
సమావేశంలో తెలంగాణ స్టేట్ ఓపెన్ స్కూల్ కు సంబంధించి అడ్మిషన్, కోర్సులు, అర్హతలపై రూపొందించిన కరదీపిక, పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు.ఈ సమావేశంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ మొగిలి స్నేహలత, జిల్లా విద్యాధికారి యాదయ్య, జిల్లా పంచాయతీ అధికారి హరిప్రసాద్, ఆర్ అండ్ బి ఇఇ శ్యామ్ ప్రసాద్, మునిసిపల్ ఇఇ కృష్ణ లాల్, ట్రైబల్ వెల్ఫర్ ఇఇ తానాజీ, పీఆర్ ఇఇ లు శ్రీనివాసరావు, చంద్రమౌళి, టిఎస్ టీడబ్ల్యూఐడిసి ఇఇ నాగశేషు, వివిధ శాఖల డిఇ లు, ఏఇలు తదితరులు పాల్గొన్నారు