సోషల్ మీడియాలో ఓ వీడియో వైరల్ అవుతోంది.ఓ చిన్న పిల్లాడికి చెందిన ఆ వీడియో ఇప్పుడు చాలా మందిని తెగ ఆకట్టుకుంటోంది.
ఆ దృశ్యాలు చాలా మందిని ఇన్స్పైర్ చేస్తున్నాయి.చాలా మంది ఆ వీడియో షేర్ చేస్తూ.
జీవితంలో సమస్యల పట్ల దృక్పథాన్ని ఎలా మార్చుకోవాలనేది చెబుతున్నారు.పిల్లాడిని చూసి జీవిత పాఠాలు బోధిస్తున్నారు.
అసలు పాఠాలు బోధించేంతగా ఆ వీడియోలో ఏముందో ఇది చదివి తెలుసుకోండి.
పిల్లలు సైకిల్ నడుపుతుంటారు.
అప్పుడప్పుడు కింద పడి దెబ్బలు తగిలించుకుంటారు కూడా.వాళ్లు అలా పడగానే దెబ్బలు తగిలితే ఏడుస్తుంటారు.
కానీ ఈ వీడియోలోని బుడ్డోడు దానికి భిన్నంగా ప్రవర్తించాడు.పిల్లాడు సైకిల్ తొక్కుతుంటాడు.
సైకిల్ నడుపుతూ దానిని మలపబోయి అదుపు తప్పడంతో కింద పడిపోతాడు.కింద పడ్డ ఆ పిల్లాడు ఏమాత్రం ఏడవకుండా.
పైకి లేచి డ్యాన్స్ చేస్తాడు.కింద పడటం పెద్ద విషయం కాదన్నట్లు డ్యాన్స్ చేస్తుంటాడు.
కింద పడితే దిగులు చెందకుండా జీవితంలోని ప్రతి నిమిషాన్ని ఎంజాయ్ చేయాలి చాటి చెప్పాడు ఆ బుడ్డోడు.ఈ పిల్లాడు జీవితానికి చెందిన ముఖ్యమైన మెసేజ్ ను చెప్పకనే చెప్పాడు ఈ పిల్లాడు.
ఆ బుడ్డోచికి చెందిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ హల్ చల్ చేస్తోంది.చాలా మందికి ఈ వీడియో ఆదర్శంగా నిలుస్తోంది.ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరూ దాని కింద కామెంట్లు పెడుతున్నారు.