22ఏళ్లుగా స్నానం లేదు జపం లేదు.. ఎందుకంటే?

ఒకటి, రెండు రోజులు స్నానం చేయకుండా ఉండటం పెద్ద మ్యాటర్ కాదు.కానీ వారం పాటు స్నానం చేయకుండా ఎవరూ ఉండలేరు.

 Bihar Man Didn't Bath For 22 Years , Bihar Person Did Not Bath 22 Years, Man On-TeluguStop.com

మరీ మంచు కురిసే ప్రాంతాలైతే తప్ప మిగతా ఎక్కడైనా రోజుకో సారి లేదా రెండ్రోజులకు ఒక సారి స్నానం చేస్తుంటారు.కానీ బిహార్ కు చెందిన ఓ వ్యక్తి 10 రోజులు కాదు, 20 రోజులు కాదు ఏకంగా 20 ఏళ్లుగా స్నానం చేయడం లేదు.

అతడు అసలు ఇలా ఎందుకు చేస్తున్నాడు.దాని వెనక కారణం ఏమిటి.

దేని కోసం ఇలా చేస్తున్నాడో ఇక్కడ తెలుసుకోండి.

బిహార్ గోపాల్ గంజ్ జిల్లా, బైకుంఠపూర్ కు చెందిన ధరమ్ దేవ్ రామ్..2000 సంవత్సరం నుండి ఒక్కసారి కూడా స్నానం చేయలేదు.మహిళల పట్ల జరుగుతున్న నేరాలకు వ్యతిరేకంగా ఇలా స్నానం చేయడం లేదని ఆయన చెప్పాడు.దాంతో పాటు భూతగాదాలు, హత్యలు ఆగిపోయేంత వరకు స్నానం చేయబోనని ప్రతిజ్ఞ చేశాడంట ధరమ్ దేవ్ రామ్.

ఆయన 40 ఏళ్ల వయస్సులో ఉన్నప్పుడు ఆఖరి సారి స్నానం చేశాడట.ప్రస్తుతం ఆయన వయస్సు 62 సంవత్సరాలు.అంటే 22 ఏళ్లుగా స్నానం, జపం లేకుండా అలాగే ఉంటున్నాడు.తాను ఓ గురువు వద్దకు వెళ్లాలనని ఆయన తనకు ఆధ్యాత్మికత గురించి వివరంగా చెప్పారని ధరమ్ చెప్పారు.

అప్పటి నుండి స్నానం చేయకుండానే రాముడిని ప్రార్థిస్తూ జీవిస్తున్నానని పేర్కొన్నాడు ధరమ్ దేవ్ రామ్.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube