సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక వీడియో నెటిజన్లను షాక్ కి గురిచేస్తోంది.దీనిని ప్రముఖ ఇన్‌స్టాగ్రామ్ పేజీ వైరల్ హాగ్ షేర్ చేసింది.
ఈ వీడియో క్లిప్ కు కొన్ని గంటల సమయంలోనే ఆరు వేలకు పైగా లైకులు, లక్షల్లో వ్యూస్ వచ్చాయి.
వైరల్ అవుతున్న వీడియోలో చాలా మంది చిన్న పిల్లలు ఉండటం గమనించవచ్చు.
ఒక చిన్నారి తన చేతిలో బేస్ బాల్ పట్టుకొని తాడుకి వేలాడుతూ ఉన్న గుర్రం బొమ్మను బలంగా కొడుతోంది.ఈ దృశ్యాన్ని మిగతా చిన్నాలందరూ చూస్తూ ఎంజాయ్ చేశారు.
కొంచెం దూరంలో ఉన్న నిజమైన గుర్రం కూడా ఈ దృశ్యాలను చూసింది.అయితే తనలాగానే ఉన్న గుర్రం బొమ్మను చిన్నపిల్లలు వేలాడదీసి మరీ చితకబాదుతుంటే అది చాలా భయపడింది.
గుర్రాలు చాలా సున్నితమైనవి.దాని ముందే ఇలా ఒక గుర్రం బొమ్మను వేలాడదీసి దాన్ని కొడుతూ భయ పెట్టడం సరికాదు.
అందుకే ఈ వీడియోను చూసిన నెటిజన్లు తిట్టిపోస్తున్నారు.చిన్న పిల్లలకి ఇలాంటి హింసాత్మకమైన పనులు నేర్పించడం ఏమైనా బాగుందా?? అని ఇంకొందరు ఏకిపారేస్తున్నారు.ఇలాంటి పనులు చేస్తే పిల్లల్లో జంతువుల పట్ల ప్రేమ పోయి క్రూరత్వం పెరుగుతుందని మరికొందరు అభిప్రాయపడుతున్నారు.నిజానికి ఇది బొమ్మ కాదు బొమ్మ లాగా కనిపించే ఒక పినాట కంటైనర్ లేదా కుండ.
బర్త్‌డే జరుపుకునే పిల్లలు దీన్ని బలంగా కొడుతూ పగల కొడతారు.అందులోనుంచి క్యాండీలు, స్వీట్స్ అన్ని కింద పడతాయి.
వాటిని ఇతర పిల్లలు ఏరుకొని ఎంచక్కా తింటారు.