ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం...జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్

ఫ్యాక్షన్ వద్దు… అభివృద్ది ముద్దు ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం సమస్యలు ఉంటే పోలీసులకు సమాచారం ఇవ్వండి జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ కర్నూలు జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన రోజే పల్లె నిద్ర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.పల్లెనిద్రలో భాగంగా జిల్లా ఎస్పీ సిధ్దార్థ్ కౌశల్ గురువారం రాత్రి కౌతాళం మండలం, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కామవరం గ్రామాన్ని సందర్శించారు.

 On The Day He Took Charge As Sp, He Started The Rural Sleep Program , District S-TeluguStop.com

కామవరం గ్రామంలో గ్రామ సచివాలయం, ఆర్టీసి బస్టాండ్, అంగన్ వాడి సెంటర్, రైతు భరోసా కేంద్రాలను జిల్లా ఎస్పీ పరిశీలించారు.పల్లె నిద్ర కార్యక్రమంలో ముందుగా గ్రామ ప్రజలను ఉద్దేశించి జిల్లా ఎస్పీ మాట్లాడుతూ సమస్యలుంటే పోలీసులకు సమాచారం అందించాలని, ఫ్యాక్షన్ జోలికి ఏవరు కూడా వెళ్ళవద్దన్నారు.

పిల్లలను బాగా చదివించుకోవాలన్నారు.

చట్ట వ్యతిరేక కార్యకలపాలకు పాల్పడితే ఏవరిని ఉపేక్షించేది లేదని హెచ్చరించారు.

తదుపరి రోజుల్లో అన్ని శాఖల అధికారులతో మాట్లాడి గ్రామాభివృద్దికి చర్యలు తీసుకుంటామాని హామీ ఇచ్చారు.మహిళలకు ఏల్లవేళల్లా అండగా ఉంటామని, దిశా యాప్ ను మొబైల్ ఉన్న ప్రతి ఒక్క మహిళ డౌన్ లోడ్ చేసుకుని ఏమైనా సమస్యలుంటే తెలియజేయాలన్నారు.

ప్రజలకు పోలీసులు దగ్గర కావడానికి పల్లె నిద్ర కార్యక్రమం ఎంతో దోహదపడుతుందన్నారు. గ్రామంలోని సమస్యలను తెలుసుకుని ఇతర శాఖలకు సిఫారసు చేస్తామన్నారు.

ఈ పల్లె నిద్ర కార్యక్రమంలో ఆదోని డిఎస్పీ వినోద్ కుమార్ , సిఐలు, ఎస్సైలు, పెద్ద ఎత్తున ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.కౌతాళం మండలం, ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామమైన కామవరంలోని మండల ఆదర్శ ప్రాథమిక పాఠశాలలో గురువారం రాత్రి జిల్లా ఎస్పీ పల్లె నిద్ర కార్యక్రమం చేపట్టారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube