ఎండాకాలంలో దాహార్తిని తీర్చే పుచ్చకాయలు మార్కెట్‌లో విపరీతంగా వస్తున్నాయి.దీంతో మార్కెట్లలో కుప్పలు తెప్పలుగా పుచ్చకాయలు కనిపిస్తున్నాయి.
ఈ పుచ్చకాయల్లో పసుపు రంగు పుచ్చకాయలు జనాన్ని ఆకర్షిస్తున్నాయి.ఈ కొత్త వెరైటీ పుచ్చకాయ చాలా అరుదుగా కనిపిస్తుంది.
ఇది గ్రీన్ పుచ్చకాయ ధరను పోలి ఉండడంతో జనం ఎంతో ఆసక్తిగా కొనుగోలు చేస్తున్నారు.మార్కెట్‌లోకి ఆకుపచ్చ, పసుపు రంగులతో పాటు జనం ఎంతగానో ఇష్టపడే ఈ పుచ్చకాయ కూడా అధికంగా కనిపిస్తోంది.
పసుపు రంగులో ఉండే ఈ పుచ్చకాయ గురించి వినియోగదారులు అడుగుతున్నారని విక్రేతలు చెబుతున్నారు.మార్కెట్‌లో అనేక రకాల పుచ్చకాయలు కిలో రూ.10 నుంచి రూ.25 వరకు వివిధ ధరలకు విక్రయిస్తున్నారు.
రాజస్థాన్‌లోని జస్రాపూర్‌కి చెందిన సురేంద్ర తివారీ పసుపు పుచ్చకాయలను పండిస్తున్నాడు.తన పొలంలో పసుపు పుచ్చకాయలను సాగు చేస్తూ అందరి నోళ్లో నానుతున్నాడు.ఈ పుచ్చకాయలు చూడగానే ఆకర్షణీయంగా ఉంటాయి, రుచిలో కూడా అంతే తీపిగా ఉంటాయి.డీఎన్-1358 పసుపు పుచ్చకాయ విత్తనాలను కర్ణాటక నుంచి కొనుగోలు చేసినట్లు తెలిపారు.ఒక్క బీగాలో 70 నుంచి 100 క్వింటాళ్ల వరకు పుచ్చకాయలు పండాయి.మార్కెట్‌లో కిలో 12 నుంచి 15 రూపాయలకు విక్రయిస్తున్నారు.పసుపు పుచ్చకాయ సాగుతో ఇప్పటి వరకు ఆయన రూ.4 లక్షలు సంపాదించాడు.