సూపర్ స్టార్ మహేష్ పరశురాం కాంబినేషన్ లో భారీ అంచనాలతో వస్తున్న సినిమా సర్కారు వారి పాట.మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో మహేష్ సరసన కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తుంది.
మే 12న రిలీజ్ అవబోతున్న ఈ సినిమా ట్రైలర్ ని లేటెస్ట్ గా రిలీజ్ చేశారు.మహేష్ లాంటి సూపర్ స్టార్ తో పరశురాం చేస్తున్న సర్కారు వారి పాట సినిమా ట్రైలర్ చూస్తే ఇది పక్కాగా మరో పోకిరి సినిమా అయ్యేలా ఉంది ట్రైలర్ ఆద్యంతం మహేష్ తన సూపర్ స్వాగ్ తో మెప్పించేశారు.
జస్ట్ ట్రైలర్ లో శాంపిల్ చూపించగా అసలు కథ సినిమాలో ఉంటుందని చెబుతున్నారు.సర్కారు వారి పాట ట్రైలర్ అంచనాలకు తగినట్టుగానే ఉందని చెప్పొచ్చు.ఈ ట్రైలర్ సినిమా అంచనాలను మరింత పెంచేసింది.సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు కామన్ ఆడియెన్స్ కి కూడా నచ్చేలా సినిమా వస్తుంది.
హ్యాట్రిక్ హిట్లతో దూసుకెళ్తున్న మహేష్ సర్కారు వారి పాట సినిమాతో కూడా మరో హిట్ తన ఖాతాలో వేసుకుంటారని ఫ్యాన్స్ ఉత్సాహంగా ఉన్నారు.