తెలుగు రాష్ట్రాల ప్రేక్షకులలో బాహుబలి, బాహుబలి2 సినిమాలను చూడని ప్రేక్షకులు దాదాపుగా ఉండరనే చెప్పాలి.ఈ సినిమాలు థియేటర్లలో బ్లాక్ బస్టర్ హిట్లు కావడంతో పాటు టీవీలలో ఎక్కువసార్లు ప్రసారమయ్యాయనే సంగతి తెలిసిందే.
అయితే ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్ర నాథ్ మాత్రం తాను బాహుబలి సిరీస్ సినిమాలను ఇప్పటివరకు అస్సలు చూడలేదని చెబుతుండటం గమనార్హం.
నేను కష్టాల్లో పడనని ఆయన చెప్పుకొచ్చారు.
నేను ఆస్పత్రిలో ఉంటే చూసుకోవడానికి నా భార్య, పిల్లలు ఉన్నారని ఆయన చెప్పుకొచ్చారు.గాసిపింగ్ చేయనని ఆయన చెప్పుకొచ్చారు.
నేను సినిమాలు చూసి దాదాపుగా 30 సంవత్సరాలు అయిందని ఆయన చెప్పుకొచ్చారు.నేను రచనా సహకారం అందించిన సినిమాలను కూడా నేను చూడలేదని యండమూరి వీరేంద్రనాథ్ కామెంట్లు చేశారు.
అప్పట్లో ఎక్కువగా బుక్ రీడింగ్ చేసేవాడినని సినిమాలను తక్కువగా చూసేవాడినని ఆయన వెల్లడించారు.నేను మగధీర, బాహుబలి సినిమాలు చూడలేదని అది నా జానర్ కాదని ఆయన చెప్పుకొచ్చారు.
నాకు సినిమాల విషయంలో ఆసక్తి లేదని అందుకే తాను సినిమాలను ఎక్కువగా చూడటం లేదని ఆయన వెల్లడించారు.యండమూరి వీరేంద్రనాథ్ చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.

లక్ష మందికి వ్యక్తిత్వ వికాస క్లాసులు చెప్పానని ఆయన చెప్పుకొచ్చారు.విజయానికి ఐదు మెట్లు బుక్ ఎంతోమందిపై ప్రభావం చూపిందని ఆయన పేర్కొన్నారు.తక్కువ బడ్జెట్ తో సినిమాలు తీయడం తనకు ఇష్టమని ఆయన కామెంట్లు చేశారు.ఆనందం వేరు సంతోషం వేరు అని సంతోషం తాత్కాలికమని ఆయన కామెంట్లు చేశారు.
రెండు సంతోషాలు కలిస్తే వచ్చేది ఆనందం అని ఆయన చెప్పుకొచ్చారు.నవల ఇచ్చిన తర్వాత నాకు ఇలాగే కావాలని చెప్పడం మూర్ఖత్వం అవుతుందని ఆయన కామెంట్లు చేశారు.
యండమూరి చేసిన కామెంట్లు నెట్టింట వైరల్ అవుతున్నాయి.