టాలెంటెడ్ డైరెక్టర్ కొరటాల శివ మెగా హీరోలతో సినిమా చేసాడు.ప్రెసెంట్ చిరంజీవి, రామ్ చరణ్ తో కలిసి డైరెక్టర్ కొరటాల శివ ఆచార్య సినిమా చేసాడు.
ఎన్నో రోజులుగా మెగా అభినులు ఆతృతగా ఎదురు చూస్తున్న ఈ సినిమా ఏప్రిల్ 29న అంటే ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇందులో రామ్ చరణ్ సిద్ధ అనే పవర్ ఫుల్ రోల్ లో నటించాడు.
ఇక చిరంజీవి ఆచార్య గా నటించాడు.అయితే మొదటిసారి మెగాస్టార్ చిరు హీరోయిన్ లేకుండా సింగిల్ గా అభిమానులను ఆకట్టు కోవడానికి థియేటర్స్ లోకి వచ్చాడు.ఈ సినిమాలో ముందు చిరంజీవి కి జోడీగా కాజల్ అగర్వాల్ నటించింది.అయితే కొద్దీ రోజుల షూటింగ్ తర్వాత కాజల్ ను సినిమా లో నుండి తీసేశారని గత కొన్ని రోజులుగా వార్తలు వస్తున్నాయి.
ఈ వార్తలను నిజం చేస్తూ ఆచార్య ప్రమోషన్స్ లో కొరటాల నిజం అని చెప్పి క్లారిటీ ఇచ్చేసాడు.కాజల్ ను సినిమాలోకి తీసుకున్నామని కానీ ఫస్ట్ షెడ్యూల్ తర్వాత ఆమె పాత్ర సంతృప్తిగా అనిపించ లేదని ఆమె పాత్రను తొలగించామని తెలిపారు.

అంతేకాదు చిరు పాత్రకు రొమాంటిక్ యాంగిల్ అవసరం లేదని అందుకే కాజల్ రోల్ ను బలవంతంగా పెట్టినట్టు అనిపించకుండా ఉండాలని ముందే ఆమె పాత్రను తొలగించమని చెప్పుకొచ్చాడు.
ఇక ఈ నిర్ణయాన్ని కాజల్ కు చెప్పగా ఆమె కూడా చిరునవ్వుతో తప్పుకుందని అన్నారు.అయితే కాజల్ ఇప్పటి వరకు సైలెంట్ గా ఉండడానికి మరో కారణం ఉందట.