MS ధోని.పరిచయం అక్కర్లేని పేరు.
క్రికెట్ గురించి తెలిసిన వారికి ధోని ఓ రోల్ మోడల్.ప్రపంచ క్రికెట్‌లోనే కూల్ కెప్టెన్ గా గుర్తింపు పొందాడు.
అనూహ్య నిర్ణయాలతో ప్రత్యర్థులకు చెమటలు పట్టించడం ధోనీకే చెల్లింది.మ్యాచ్ ఎంతటి ప్రమాదపు స్థితిలో వున్నా, ధోనీ మొఖంలో అస్సలు టెన్షన్ కనపడదు.
తన ప్రశాంతమైన ఆటిట్యూడ్ తోనే ప్రత్యర్థులకు టెన్షన్ తెప్పిస్తాడు.ఇక మ్యాచ్ ఓడినా, గెలిచినా ఒకే విధంగా ఉండటం ధోనీ ప్రత్యేకత.
ఇకపోతే ధోనీ సతీమణి సాక్షిసింగ్ గురించి కూడా అందరికీ తెలిసిందే.ధోనీకి తగ్గ భార్య సాక్షి అనడంలో అతిశయోక్తి లేదు.
అయితే ఈమె ధోని లాగా కూల్ కాదు.కూసింత అగ్రిసివ్ నెస్ ఈమె సొంతం.
ఈమె తాజాగా ట్విటర్ వేదికగా అక్కడి ప్రభుత్వంపై నిప్పులు చెరిగారు.ఆమె కోపానికి కారణం ఏమిటంటే, ఝార్ఖండ్‌లో కొద్దిరోజులుగా కొన్ని ప్రాంతాల్లో పగటి ఉష్ణోగ్రతలు అత్యధికంగా నమోదవుతున్నాయి.
దీంతో ప్రజలు మిట్ట మధ్యాహ్నం బయట తిరిగేందుకు జంకుతున్నారు.ఉదయం, సాయంత్రం వేళల్లో పనులు చూసుకుంటూ మధ్యాహ్నం ఇంట్లోనే సేదతీరుతున్నారు.
అయితే మధ్యాహ్నం సమయంలో అక్కడ విద్యుత్ కోతలు ప్రజలను ఒకింత ఇబ్బందులకు గురిచేస్తున్నాయి.రాష్ట్ర రాజధాని రాంచీ, జంషెడ్‌పూర్ వంటి నగరాల్లో మినహా అన్ని నగరాల్లో అప్రకటిత విద్యుత్ కోతలు విధిస్తున్నారు.
ఈ క్రమంలో విద్యుత్ కోతలుపైన ఆమె గొంతెత్తింది.అక్కడి ప్రభుత్వంపై విమర్శల దాడి చేసింది.“ఒక ట్యాక్స్ పేయర్ గా ఝార్ఖండ్ ప్రభుత్వాన్ని అడుగుతున్నా! కొన్నేళ్ల నుంచి రాష్ట్రంలో విద్యుత్ సంక్షోభం ఇంతలా ఎందుకు పెరిగిందని తెలుసుకోవాలనుకుంటున్నాను, బాధ్యత కలిగిన పౌరులుగా విద్యుత్ ను ఆదాచేసేందుకు మేం అన్ని ప్రయత్నాలు చేస్తున్నాం.అయినా, విద్యుత్ కోతలు మీరు ఎందుకు ఆపడం లేదు!” అని ప్రభుత్వాన్ని నిలదీసింది.
కాగా ఝార్ఖండ్ లో ముక్తి మోర్చా అధినేత హేమంత్ సోరెన్ సీఎంగా వున్నసంగతి తెలిసినదే.అయితే సాక్షి సింగ్ ధోనీ ట్వీట్ కు ప్రభుత్వం నుంచి ప్రస్తుతానికి ఎలాంటి స్పందన రాకపోవడం కొసమెరుపు.