బాలివుడ్ స్టార్ హీరోయిన్ అలియా భట్ గురించి తెలియని వారు అంటూ ఎవరూ ఉండరు.బాలీవుడ్ స్టార్ హీరోయిన్స్ లో టాప్ హీరోయిన్ గా ఒక వెలుగు వెలుగుతుంది అలియా.
ఒక పక్క సినిమాల్లో నటిస్తూనే మరోపక్క యాడ్స్ కూడా చేస్తూ తెగ బిజీ అయిపోయింది ఈ బాలీవుడ్ భామ.రీసెంట్ గా రిలీజ్ అయిన పాన్ ఇండియా మూవీ ఆర్ఆర్ఆర్ మూవీలో సీత పాత్రలో అద్భుతంగా నటించి అందరినీ మెప్పించింది.రీసెంట్ గానే స్టార్ నటుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.ఎన్నో ఏళ్లుగా రణబీర్ తో ప్రేమలో ఉంది.ఇన్నాళ్లకు ఇద్దరూ కూడా పెళ్లి అనే బంధంతో ఒక్కటయ్యారు.అయితే రణబీర్ కపూర్ తో ప్రేమలో పడకముందే అలియా నలుగురుతో ఎఫైర్స్ నడిపింది.
అవన్నీ దాటుకుని ఇప్పుడు రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.మరి అలియా లవ్ ఏఫైర్ నడిపిన ఆ నలుగురు వ్యక్తులు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం.
అలియా భట్ కు తన చిన్నతనం నుంచి స్నేహితులు ఎక్కువగానే ఉండేవాళ్లు.స్నేహితులతో ఎక్కువ టైమ్ స్పెండ్ చేస్తూ ఉండేది.అలాంటి స్నేహితులలో ఒకడే అలీ దాదార్కర్. అలియా భట్ సినిమాల్లోకి రాకముందే తన స్నేహితుడితో లవ్ ఎఫైర్ నడిపింది.
అలియా తన మొదటి సినిమా చేసే సమాయానికి కూడా అలీ దాదార్కర్ తో ప్రేమలో ఉంది.ఆ తరువాత సినిమా మంచి విజయం అవ్వడంతో అలియా సుడి మారిపోయింది.
ఆ తరువాత కాలంలో అలీ దాదార్కర్ తో రిలేషన్ బ్రేక్ చేసుకుంది.కొన్నాళ్లకు అలీ దాదార్కర్ మరో అమ్మాయిని వివాహం చేసుకున్నాడు.
ఇక అలియా లైఫ్ లో సిద్ధార్థ్ మల్హోత్రా కూడా ముఖ్య పాత్ర పోషించాడనే చెప్పాలి.

అలియా భట్ నటించిన మొదటి సినిమా “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్”లో హీరోగా సిద్దార్ద్ మల్హోత్రా నటించాడు.ఇద్దరికీ ఇదే మొదటి సినిమా అవ్వడంతో ఇద్దరి మధ్య కాస్త చనువు ఏర్పడింది.తమ మొదటి సినిమా సూపర్ హిట్ కావడంతో ఇద్దరు పార్టీలు, ఫంక్షన్స్ అంటూ బాగా దగ్గర అవ్వడంతో వీరి మధ్య ప్రేమ పుట్టుకొచ్చింది.
అలియా మాత్రం సిద్ధార్థ్ మల్హోత్రాతో ప్రేమ విషయంలో స్ట్రాంగ్ గా ఉన్నప్పటికీ సిద్ధార్థ్ మాత్రం మరో హీరో హీరోయిన్ తో కూడా క్లోజ్ గా ఉండేవాడు.అలా ఇద్దరి మధ్య అభిప్రాయ బేధాలు రావడంతో అలియా బ్రేకప్ చెప్పేసింది.

ఇక ఆలియా బ్రేక్ అప్ లిస్ట్ లో ఉన్న మరో వ్యక్తి వరుణ్ ధావన్. ఇతను కూడా “స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్” మూవీతోనే కెరీర్ స్టార్ట్ చేశాడు.వీరు ఇద్దరు బాల్య స్నేహితులు.అయితే అప్పటికే రెండుసార్లు ప్రేమలో విఫలం అవ్వడంతో అలియా తన బాల్య స్నేహితుడికి తన గురించి అన్ని తెలుసు కదా అని వరుణ్ ధావన్ కే మనసు ఇచ్చింది.
కానీ అలియా తరువాత పెద్ద స్టార్ అయిపోవడంతో వరుణ్ కి కూడా దూరం అయ్యింది.వరుణ్ తరువాత మరో యువతిని పెళ్లి చేసుకున్నాడు.

ఇకపోతే లాస్ట్ బట్ నాట్ లీస్ట్ అన్నట్టుగా అలియా జీవితంలో చివరి వ్యకి కవిన్ మిట్టల్. మీలో చాలా మందికి “హైక్ ” మెసెంజర్ యాప్ తెలిసే ఉంటుంది.ఆ సంస్థ అధినేతే కవిన్ మిట్టల్.ఓ ప్రమోషనల్ ఈవెంట్ లో కవిన్ మిట్టల్,అలియా మధ్య పరిచయం ఏర్పడింది.అలా వీరిద్దరూ కలసి కొన్నాళ్లు ట్రావెల్ చేశారు.నిజానికి కవిన్ మిట్టల్, అలియా తమ ప్రేమ విషయాన్ని ఎప్పుడూ అధికారికంగా ప్రకటించలేదు.
రూమర్స్ మాత్రం వచ్చాయి అంతే.ఇలా అలియా నలుగురి వ్యక్తుల ప్రేమను దాటుకుని చివరికి రణబీర్ కపూర్ ను పెళ్లి చేసుకుంది.
వీరి వివాహం కూడా అంగరంగ వైభవంగా జరిగింది.