తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్‌గా మారింది.విమర్శ, ప్రతివిమర్శలతో ధాన్యం కొనుగోళ్లపై ఢీ అంటే ఢీ అన్నాయి.
ఈ క్రమంలో రాజకీయాలు రసవత్తరంగా మారాయి.అయితే కేంద్రం మాత్రం రా రైస్ కొంటామని బాయిల్డు రైస్ కొనబోమని చెప్పడంతో చివరకు రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేస్తోంది.
దీంతో ధాన్యం సమస్య సద్దుమణిగింది.ఈ తరుణంలో మరో అంశాన్ని టీఆర్ఎస్ లేవనెత్తింది.
గుజరాత్‌తో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాలు కర్నాటక, తదితర రాష్ట్రాల్లో విద్యుత్ కొరత ఏర్పడిందని కానీ, తెలంగాణలో మాత్రం 24 గంటలు ఇస్తున్నామని, మౌలిక సదుపాయాలు కల్పిస్తున్నామని విమర్శలు సంధిస్తున్నారు.అభివృద్ధిలో సైతం పోలిక అంటూ ట్విట్టర్ వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.
పార్టీ సమావేశమా? మీడియా సమావేశమా? ఏదైనా ఒక్కటే కేంద్రంపై విమర్శలు.అంతేకాదు పీఎం నరేంద్రమోడీ లక్ష్యంగా విమర్శలు సంధిస్తున్నారు.
దీంతో రాష్ట్ర బీజేపీ నాయకులు ప్రతి ఆరోపనలు గుప్పిస్తున్నారు.అయినప్పటికీ అంతగా పట్టించుకోనట్లు వ్యవహరిస్తూనే.
రాష్ట్రంలో బీజేపీలేదని, అదో పనికి పాలిన పార్టీ అని విమర్శలు చేస్తున్నారు టీఆర్ఎస్ నాయకులు.అంతేకాదు.
కేటీఆర్ సైతం టీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం కాంగ్రెస్సే అని పేర్కొంటుండటం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది.
టీఆర్ఎస్ పార్టీ 21 వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని మరింత స్పీడ్ పెంచారు.
నరేంద్ర మోడీ గాడ్సే భక్తుడని నేనంటున్నా… నన్ను కూడా జైల్లో పెడతారా పెట్టండి చూద్దాం అంటూ మీడియాకు ఇస్తున్న ప్రత్యేక ఇంటర్వ్యూల్లో కేటీఆర్ సవాల్ చేస్తున్నారు.మరో పక్క సర్కారియా కమిషన్ నిబంధనలకు విరుద్ధంగా బీజేపీ నాయకురాలిని గవర్నర్‌గా చేశారని.
గతంలో విమర్శించిన మోడీయే ప్రధాని అయిన తర్వాత కమిషన్ కు విరుద్ధంగా గవర్నర్లను నియమిస్తున్నారని మండిపడుతున్నారు.అంతేకాదు మరో పక్క ట్విట్టర్ వేదికగా కేంద్రంపై, మోడీపై విమర్శలు గుప్పిస్తున్నారు.
జామ్‌నగర్‌కు తరలించాలని నిర్ణయించుకున్నారని, తెలంగాణపై మోడీ వివక్ష కథ నిరంతరం కొనసాగుతోందని మండిపడ్డారు.కేంద్రం మంజూరు చేసిన ఐఐఎం -7, ఐఐటీ -7, ఐఐఎస్ఈఆర్-2, త్రిబుల్ ఐటీ -16,ఎన్ఐడీ -4, మెడికల్ కాలేజ్ -157, నవోదయ-84 ఇందులో తెలంగాణకు ఒకటి కూడా కేటాయించకపోవడం కేంద్రం తెలంగాణపై వివక్షతను స్పష్టం చేస్తుందని పేర్కొన్నారు.
విభజన అంశాలను నెరవేర్చకపోవడాన్ని కేంద్రాన్ని పదేపదే ప్రశ్నిస్తున్నారు.

రాష్ట్ర ప్రయోజనాలను ఫణంగా పెట్టి రాజీపడే ధోరణిలో రాజకీయాలు ఉండకూడదని, రాష్ట్రానికి జరుగుతున్న అన్యాయంపై వెన్నెముక లేని టీ బీజేపీ నాయకులు గొంతెత్తగలరా అని ప్రశ్నించారు.అయితే ఓన్లీ కేంద్రమే టార్గెట్ విమర్శలు గుప్పిస్తున్న కేటీఆర్ కే రాష్ట్రంలోని ప్రజాసమస్యలు కనిపించడం లేదా? అని బీజేపీ నాయకులు బహిరంగంగా ప్రశ్నిస్తున్నారు.ట్విట్టర్‌లో రీ ట్వీట్లు సైతం చేస్తున్నారు.
నిరుద్యోగుల సమస్యలు, డబుల్ బెడ్రూం, రైతు రుణమాఫీ ఇలా చాలా సమస్యలు ఉన్నప్పటికీ వీటిపై దృష్టిసారించకుండా కేవలం విమర్శలు చేస్తూ కాలం గడుపుతున్నారు.