తెలుగుతో పాటు ఇతర దక్షిణాది భాషల్లోని సినిమాలలో నటించి నటిగా సుహాసిని ఊహించని స్థాయిలో పాపులారిటీని సంపాదించుకున్నారు.నటిగానే కాకుండా ప్రొడ్యూసర్ గా డైరెక్టర్ గా కూడా సుహాసిని సత్తా చాటారు.
ఒక ఇంటర్వ్యూలో సుహాసిని మాట్లాడుతూ తమిళనాడు రాష్ట్రంలోని పరమకుడి సొంతూరు అని మాది జాయింట్ ఫ్యామిలీ అని వెల్లడించారు.నేను మున్సిపల్ స్కూల్ లో చదువుకున్నానని సుహాసిని తెలిపారు.
సత్య జిత్ రే, బాలచందర్ నాకు ఇష్టమైన డైరెక్టర్లు అని డబ్బు కొరకు తాను సినిమాలకు ఓకే చెప్పలేదని గ్లామర్ హీరోయిన్ గా ఎదగాలని తాను భావించలేదని సుహాసిని వెల్లడించారు.స్కూల్ లో చదువుకునే సమయంలో తాను బ్యాంక్ మేనేజర్ కావాలని కలలు కన్నానని అమ్మ తాను ఇంగ్లీష్ లెక్చరర్ కావాలని భావిస్తే నాన్న మాత్రం కలెక్టర్ లేదా ఇంజినీర్ చేయాలని అనుకున్నారని సుహాసిని కామెంట్లు చేశారు.

బాలు మహేంద్ర గరు తాను పక్కింటి అమ్మాయిలా కనిపిస్తానని సినిమాలలో ఛాన్స్ ఇచ్చారని 19 సంవత్సరాల వయస్సులోనే ఉత్తమ నటిగా తొలి సినిమాకు తమిళనాడు ప్రభుత్వ అవార్డ్ ను పొందానని సుహాసిని కామెంట్లు చేశారు.ఇండస్ట్రీలో చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారని ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో చేరిన 108 మందిలో తాను మాత్రమే అమ్మాయినని సుహాసిని చెప్పుకొచ్చారు.

తాను హీరోయిన్ అయిన తర్వాత మణిరత్నం గారు ఒక కథతో తన దగ్గరకు వచ్చారని కథ నచ్చకపోవడంతో ఆ మూవీ చేయనని చెప్పానని సుహాసిని వెల్లడించారు. మా నాన్న, మణిరత్నం అన్నయ్య ఫ్రెండ్స్ కావడంతో తమ పెళ్లి ఫిక్స్ అయిందని ఆమె తెలిపారు.అన్ని సౌత్ భాషలను తాను మాట్లాడగలనని ప్రస్తుతం ఫ్రెంచ్ నేర్చుకుంటున్నానని ఆమె చెప్పుకొచ్చారు. లాక్ డౌన్ సమయంలో పియానో నేర్చుకున్నానని ఆమె కామెంట్లు చేశారు.సుహాసిని చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి.