మెగా హీరో రామ్ చరణ్ RRR సినిమా విజయం తర్వాత సోషల్ మీడియాలోఎంతో యాక్టివ్ గా ఉంటున్నారు ఈ క్రమంలోనే తనకు సంబంధించిన ప్రతి ఒక్క విషయాన్ని అభిమానులతో పంచుకొని అభిమానులను సందడి చేస్తున్నారు.ఈ క్రమంలోనే గత రెండు రోజుల క్రితం అమృత్ సర్ లో జవాన్లతో కలిసి వారికి ప్రత్యేక విందు ఏర్పాటు చేసిన రామ్ చరణ్ తాజాగా సికింద్రాబాద్పరేడ్ గ్రౌండ్‌లో డిఫెన్స్ అధికారులు నిర్వహించిన ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో రామ్ చరణ్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఈయన పుష్పగుచ్చంతో యుద్ధవీరులకు నివాళులకు అర్పించారు.
ఈ సందర్భంగా రామ్ చరణ్ మాట్లాడుతూ ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ ఉత్సవాల్లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది.75 సంవత్సరాల స్వతంత్ర సంబరాలు దేశభద్రతను కాపాడుతున్న జవాన్లను, వారి త్యాగాలను గౌరవించుకోవడం నా అదృష్టం.మనం ఇక్కడ ప్రశాంతంగా నిద్ర పోతున్నాము అంటే దేశ సైనికుల సేవలే కారణమని ఆయన వెల్లడించారు.
దేశం కోసం అహర్నిశలు శ్రమిస్తున్న సైనికుల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే.

మనం నడిచే ఈ నేల, పీల్చే గాలి, బ్రతుకుతున్న ఈ దేశం మీద జవాన్ల చెరగని సంతకం ఉంటుంది.వీరి త్యాగాలను ఎవరూ మర్చిపోవద్దు.మన దేశం ప్రశాంతంగా ఉంది అంటే అది కేవలం సైనికుల సేవ వల్లే అంటూ రామ్ చరణ్ ఈ కార్యక్రమంలో జవాన్ల సేవలను కొనియాడారు.
ఇక రామ్ చరణ్ సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న RC15 సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నారు.ఇక తన తండ్రితో కలిసి రామ్ చరణ్ నటించిన ఆచార్య సినిమా ఈనెల 29వ తేదీన విడుదలకు సిద్ధమైంది.