సూర్యాపేట జిల్లా:జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాల నెంబర్ -2 ప్రధానోపాధ్యాయుడి కామ కాలాపాల బాగోతం ఆలస్యంగా వెలుగుచూసింది.వివరాల్లోకి వెళితే గత మూడు రోజుల నుంచి చందన బీఈడీ కళాశాలకు చెందిన విద్యార్థిని బీ.
ఎడ్ టీచింగ్ ట్రైనింగ్ లో భాగంగా నెంబర్-2 ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు హాజరవుతూ ఉంది.ఈ నేపథ్యంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ రషీద్ ఆమె పట్ల అసభ్యంగా ప్రవర్తించి,లైంగిక వేధింపుల పాల్పడ్డాడని తెలుస్తోంది.
విషయం తెలుసుకున్న విద్యార్థి సంఘాల నాయకులు బాధిత విద్యార్ధిని జరిగిన అన్యాయంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.విద్యార్థిని పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన ప్రధానోపాధ్యాయుడు అబ్దుల్ రషీద్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ బీసీ విద్యార్థి సంఘం,గిరిజన విద్యార్థి సంఘం,రాష్ట్రయ విద్యార్థి పరిషత్ ఆధ్వర్యంలో ఎడి శైలజకి వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం వారు మాట్లాడుతూ 75 ఏళ్ల స్వతంత్ర భారతదేశంలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని,ప్రభుత్వాలు ఇకనైనా మేల్కొని అమ్మాయిలకు రక్షణ కల్పించాలని డిమాండ్ చేశారు.ప్రధానోపాధ్యాయుడిపై సమగ్ర విచారణ జరిపి చట్టపరమైన చర్యలు తీసుకొని క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో బీసీఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు వావిళ్ళ గౌడ్,ఎల్ హెచ్ పి ఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షులు భిక్ష నాయక్,బిసి విద్యార్థి సంఘం సూర్యాపేట జిల్లా అధ్యక్షుడు వీరబోయిన లింగయ్య యాదవ్,గిరిజన విద్యార్థి సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేష్ నాయక్,టివిఎస్పీ రాష్ట్ర అధ్యక్షులు బంటు సందీప్, రాంబాబు గౌడ్ తదితరులు పాల్గొన్నారు.