టాలీవుడ్ ఇండస్ట్రీలో చాలామంది దర్శకులు సరైన సక్సెస్ లేక ఇండస్ట్రీకి దూరమవుతున్న సంగతి తెలిసిందే.అయితే దర్శకధీరుడు రాజమౌళి మాత్రం వరుసగా 12 విజయాలను సొంతం చేసుకున్నారు.21 సంవత్సరాల సినీ కెరీర్ లో రాజమౌళి ఈ విజయాలను సాధించారు.సినిమాసినిమాకు దర్శకునిగా జక్కన్న అంతకంతకూ ఎదుగుతున్నారు.
పవన్, మహేష్, బన్నీలతో జక్కన్న ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా తెరకెక్కించలేదు.
అయితే రాజమౌళి తర్వాత ప్రాజెక్ట్ లో మహేష్ బాబు హీరో కాగా బన్నీ రాజమౌళి కాంబినేషన్ లో సినిమా తెరకెక్కుతుందేమో చూడాల్సి ఉంది.
అయితే ఏ సినిమా తీసినా రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కే సినిమా బ్లాక్ బస్టర్ కావడం వెనుక ఆయన కృషి కారణమని చెప్పవచ్చు.తను షూట్ చేసే సన్నివేశాల విషయంలో జక్కన్న ఏ మాత్రం రాజీ పడరు.
తన ఊహలో ఉన్న విధంగా సీన్ వచ్చేవరకు రాజమౌళి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు.
అదే సమయంలో అనవసరమైన విషయాలకు డబ్బులు ఖర్చు చేయకుండా జక్కన్న జాగ్రత్త పడతారు.
రాజమౌళి సక్సెస్ సీక్రెట్ ఇదే కాగా పాత్రకు తగిన విధంగా నటీనటులను ఎంపిక చేసుకోవడం కూడా జక్కన్న సక్సెస్ కు ఒక విధంగా కారణమని చెప్పవచ్చు.రాజమౌళి సినిమాలో చిన్న పాత్ర ఉన్నా ఆ పాత్రకు ఎంతో ప్రాధాన్యత కచ్చితంగా ఉంటుంది.
అందుకే రాజమౌళి సినిమాలో రోల్ అంటే ఎవరైనా సరే ఎగిరి గంతేస్తారు.

తెలుగు సినిమాల ఖ్యాతిని పెంచిన దర్శకునిగా ఇండస్ట్రీలో రాజమౌళికి గుర్తింపు ఉంది.ఈ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ ఇతర ఇండస్ట్రీల నుంచి ఆఫర్లు వస్తున్నా తెలుగు సినిమాలకే పరిమితమవుతూ ఉండటం గమనార్హం.జక్కన్న డైరెక్షన్ లో తెరకెక్కిన సినిమా అంటే గూస్ బంప్స్ వచ్చే సీన్లు ఎక్కువ సంఖ్యలో ఉంటాయనే సంగతి తెలిసిందే.