1.భారత విద్యార్థుల పై యాపిల్ సీఈవో ప్రశంసలు

భారత విద్యార్థులపై యాపిల్ సీఈఓ టిమ్ కుక్ చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.తమిళనాడుకు చెందిన విద్యార్థులకు ట్విట్టర్ ద్వారా ప్రశంసలు తెలియజేశారు.యాపిల్ సంస్థ గత ఏడాది ఐఫోన్ 11 సిరీస్ లో భాగంగా ఐఫోన్ 13 అనే మినీ మొబైల్ ఫోన్ ను విడుదల చేసింది.
ఈ ఫోన్ తో తమిళనాడు విద్యార్థులు అద్భుతమైన ఫోటోలు తీశారు.ఇప్పుడు ఆ ఫోటోలు చెన్నై లోని ప్రముఖ ఎగ్మోర్ మ్యూజియం లు ప్రదర్శనకు ఉండడంతో యాపిల్ సీఈవో ప్రశంసలు కురిపించారు.
2.న్యూ జెర్సీలో ఎన్నారైలతో మంత్రి కేటీఆర్

న్యూజెర్సీలో స్థిరపడ్డ తెలంగాణ వాసులు నిర్వహించే సభలో పాల్గొన్న మంత్రి కేటీఆర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.ఎన్నారైలు తాము చదివిన పాఠశాల కళాశాలలో మెరుగైన సౌకర్యాల కల్పనకు ప్రజలు తగిన ఆర్థిక సహకారం అందించాలని కేటీఆర్ విజ్ఞప్తి చేశారు.
3.అమెరికాలో ఎన్నారై హత్య .నిందితుడి ఆచూకీ తెలిపితే భారీ నజరాన
అమెరికాలో ఇటీవల భారత సంతతికి చెందిన జాన్ దయాస్ ను హత్య చేసిన నిందితుల ఆచూకీ తెలిపినవారికి 5000 డాలర్ల నజరానా ఇస్తామంటూ క్రైమ్స్ స్టాఫర్స్ అనే స్వచ్ఛంద సంస్థ తాజాగా ప్రకటించింది.
4.కొత్త సోషల్ మీడియా ఏర్పాటులో ఎలన్ మాస్క్

ప్రముఖ విద్యుత్ వాహనాల తయారీ సంస్థ టెస్లా అధినేత ఎలెన్ మాస్క కొత్త సోషల్ మీడియా ను రూపొందించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు .ఈ విషయాన్ని ఆయన ట్విట్టర్ ద్వారా తెలిపారు.
5.రష్యా పై ఉక్రెయిన్ ఆరోపణలు

రష్యా పై మరోసారి సంచలన ఆరోపణలు చేసింది. చమురు ఉత్పత్తులు, ఆహార ఉత్పత్తి చేసే ప్రాంతాలపై దాడులకు దిగుతున్నాయి అని ఉక్రెయిన్ మంత్రి వాడ్యమ్ డేనిసెంకో ఆరోపించారు.
6. పుతిన్ పై బైడన్ సంచలన వ్యాఖ్యలు

రష్యా అధ్యక్షుడిగా ఉండే అర్హత పుతిన్ కు లేదని, అమెరికా అధ్యక్షుడు జో బైడన్ సంచలన వ్యాఖ్యలు చేశారు.
7.విమాన ప్రమాదంలో మరో బ్లాక్ బాక్స్ గుర్తింపు

చైనాలో జరిగిన ఘోర విమాన ప్రమాదం లో మరో బ్లాక్ బాక్స్ లభించింది.దీనిద్వారా ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునే అవకాశం ఉందని అధికారులు స్పష్టం చేశారు.
8.అమెరికాలో ముగిసిన మంత్రి కేటీఆర్ పర్యటన
తెలంగాణ మంత్రి కేటీఆర్ అమెరికా పర్యటన విజయవంతంగా ముగిసింది.తెలంగాణ లో పెట్టుబడి పెట్టనున్నట్టు నాలుగు సంస్థలు ప్రకటించాయి.
9.నేటి నుంచి పూర్తి స్థాయిలో అంతర్జాతీయ సర్వీస్ లు
అంతర్జాతీయ విమాన సర్వీసులు నేటి నుంచి పునఃప్రారంభం అయ్యాయి.రెండేళ్ల తర్వాత విమాన రాకపోకలు పూర్తిస్థాయిలో జరగనున్నాయి.







