వైఎస్ వివేకాను ఎవరు హత్యచేశారో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చెప్పాలని తెలుగుదేశం పార్టీ నేత బుద్ధా వెంకన్న డిమాండ్ చేశారు.ఆదివారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఎమ్మెల్యే రోజా మాటలకు విలువ ఉండదన్నారు.
ఆమె చేసిన వ్యాఖ్యలపై స్పందించాల్సిన అవసరం లేదన్నారు. వివేకా హత్య కేసుపై కోర్టుకెళ్లామని, హైదరాబాద్‌లో ఉన్న వివేకా కుమార్తె సునీతకు రక్షణ కల్పించాలని కోరారు.
జనసేన బ్యానర్లు తొలగించడాన్ని ఖండిస్తున్నామని బుద్ధా వెంకన్న అన్నారు.