బుల్లితెరపై ఎన్నో జోడీలు ఉన్నా రష్మీ సుధీర్ జోడీ ప్రత్యేకమనే సంగతి తెలిసిందే.ఈ జోడీ రియల్ జోడీ కాకపోయినా రియల్ జోడీని మించి ప్రేక్షకులను ఆకట్టుకోవడం గమనార్హం.
ఈటీవీ ఛానల్ తో పాటు ఇతర ఛానెళ్లలో కూడా ఈ జోడీ సందడి చేస్తుండటం గమనార్హం.అగ్రిమెంట్ పూర్తి కావడంతో సుడిగాలి సుధీర్ ఇతర టీవీ ఛానెళ్లలో కూడా కనిపిస్తున్నారని సమాచారం అందుతోంది.
రష్మీ సుధీర్ ఇప్పటికే ఢీ షో నుంచి దూరమైన సంగతి తెలిసిందే.
ఎక్స్ట్రా జబర్దస్త్ షోలో మాత్రం వీళ్లిద్దరూ కలిసి కనిపిస్తూ సందడి చేస్తుండటం గమనార్హం.
అయితే సుధీర్ రష్మీ లవ్ ట్రాక్ గురించి ప్రశ్న ఎదురు కాగా ఆ ప్రశ్నకు సీనియర్ స్టార్ హీరోయిన్ ఇంద్రజ తనదైన శైలిలో స్పందించారు.సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంద్రజ ఒకవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు పలు టీవీ షోలకు జడ్జిగా వ్యవహరిస్తూ కెరీర్ ను కొనసాగిస్తూ ఉండటం గమనార్హం.
ఈ నెల 18వ తేదీన విడుదల కానున్న స్టాండప్ రాహుల్ సినిమాలో ఇంద్రజ రాజ్ తరుణ్ తల్లి పాత్రలో కనిపించనున్నారు.
ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా మీడియాతో ముచ్చటించిన ఇంద్రజ టీవీ షోలు టీఆర్పీ కోసం అని స్క్రిప్టెడ్ అని చాలామంది భావిస్తారని అయితే అది నిజం కాదని ఆమె అన్నారు.
టీవీ షోలలో రియల్ ఎమోషన్లు ఉంటాయని ఇంద్రజ పేర్కొన్నారు.ఈటీవీ ఛానల్ లో ప్రసారమయ్యే శ్రీదేవి డ్రామా కంపెనీ షోలో కంటెస్టెంట్లు నిజంగానే ఏడుస్తారని ఇంద్రజ వెల్లడించారు.
ఆ సమయంలో బాధలను విని తాము కూడా ఎమోషనల్ అవుతామని ఇంద్రజ పేర్కొన్నారు.
తాము కంటెస్టెంట్లతో చెప్పే చాలా మాటలు ఎడిటింగ్ లో కట్ అవుతాయని ఇంద్రజ చెప్పుకొచ్చారు.రష్మీ సుధీర్ మధ్య లవ్ ట్రాక్ అనేది వాళ్ల వ్యక్తిగతం అని ఇంద్రజ వెల్లడించారు.రష్మీ సుధీర్ లవ్ ట్రాక్ ను తాను పట్టించుకోనని దాని గురించి కామెంట్లు చేయనని ఇంద్రజ పేర్కొన్నారు.
లవ్ ట్రాకులను ఆడియన్స్ కు వదిలేయాలని ఆడియన్స్ చూసిందే నమ్ముతారని ఇంద్రజ వెల్లడించారు.